News January 1, 2025
నేడు దుర్గమ్మ సన్నిధికి సీఎం చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు నేడు బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు ఆయన అమ్మవారి సన్నిధికి చేరుకుంటారని తెలుస్తోంది. అనంతరం నగర టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలను కలిసి మాట్లాడనున్నారు. కాగా.. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తన కోసం బొకేలు, శాలువాలు, కేకులు తీసుకురావొద్దని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు.
Similar News
News January 6, 2025
నిప్పు లేనిదే పొగ రాదు: ఏబీ డివిలియర్స్
భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఏదో జరుగుతోందని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అనుమానం వ్యక్తం చేశారు. నిప్పు లేనిదే పొగ రాదని ఆయన చెప్పారు. ‘విదేశాల్లో ఆడేటప్పుడు ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. కుటుంబాన్ని వదిలేసి వారాల తరబడి ఉండటం వారిని కుంగదీస్తుంది. BGTలో వరుస ఓటములు భారత ఆటగాళ్లలో విభేదాలు సృష్టించి ఉండొచ్చు. క్రికెటర్లు అత్యుత్తమ ఆట ఆడనప్పుడు ఇలాంటి రూమర్లు వస్తాయి’ అని పేర్కొన్నారు.
News January 6, 2025
కమిన్స్.. ఈజీగా కప్పులు కొట్టేస్తున్నాడు!
ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ ఐసీసీ ట్రోఫీల్లో అదరగొడుతున్నారు. తన నాయకత్వంలో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, వన్డే వరల్డ్ కప్, యాషెస్, BGT సిరీస్‌లు గెలుచుకుంది. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్, బౌలింగుల్లో కమిన్స్ అద్భుతంగా రాణిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రమే కాదు గతేడాది IPLలో SRHను ఫైనల్‌కు తీసుకొచ్చిందీ ఈ ఆస్ట్రేలియా స్టారే.
News January 6, 2025
జనవరి 06: చరిత్రలో ఈరోజు
* 1847: వాగ్గేయకారుడు త్యాగయ్య మరణం
* 1852: అంధులకు బ్రెయిలీ లిపి రూపొందించిన లూయీ బ్రెయిలీ మరణం
* 1929: కోల్‌కతాలో పేదలకు, రోగులకు సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మదర్ థెరిసా
* 1959: భారత మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ పుట్టినరోజు
* 1966: మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ బర్త్‌డే