News January 1, 2025
తెలుగు భాషను జగన్ భ్రష్టుపట్టించారు: మండలి బుద్ధప్రసాద్
AP: మాజీ సీఎం జగన్ తెలుగు భాషను పూర్తిగా భ్రష్టుపట్టించారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మండిపడ్డారు. ‘విజయవాడలో జరిగిన తెలుగు మహాసభలకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. అయినా సరే ఆయన వాటిని తెలుగుదేశం మహాసభలంటూ నోరుపారేసుకున్నారు. ఏమీ తెలుసుకోకుండా మాట్లాడటం జగన్‌కు అలవాటు. ఆయన హయాంలో తెలుగు భాషను నాశనం చేసేందుకు యత్నించారు’ అని ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News January 6, 2025
రేసింగ్ కేసు.. ఇవాళ విచారణకు కేటీఆర్!
TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి KTR ఇవాళ ఉ.10.30 గం.లకు ACB ఎదుట హాజరుకానున్నారు. UKకు చెందిన రేసింగ్ నిర్వహణ సంస్థకు రూ.45.71కోట్లు నిబంధనలకు విరుద్ధంగా చెల్లించినట్లు ఆయనపై అభియోగాలున్నాయి. దీనిపై విచారణ చేపట్టిన ACB విచారణకు రావాలంటూ ఈనెల 3న కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. ఇదే కేసుపై దర్యాప్తు జరుపుతున్న ఈడీ ఈనెల 7న(రేపు) తమ ఎదుట హాజరుకావాలని ఆయనకు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.
News January 6, 2025
టైమ్‌పాస్‌కు తినండి.. పోషకాలు పొందండి
వేయించిన శనగల్లో పుష్కలంగా ప్రొటీన్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడి మలబద్ధకాన్ని నివారిస్తాయి. క్యాలరీలు, ఫ్యాట్ తక్కువగా ఉండటం వల్ల బరువు పెరగకుండా దోహదపడతాయి. కండరాలు, ఎముకల పనితీరును మెరుగుపరిచే కాల్షియం, మెగ్నీషియం శనగల్లో లభిస్తుంది. వీటిలో ఉండే విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే నిత్యం టైమ్‌పాస్‌గా గుప్పెడు నోట్లో వేసుకొని పోషకాలను పొందండి.
News January 6, 2025
రైతుభరోసాపై నేడు బీఆర్ఎస్ నిరసనలు
TG: రైతు భరోసాపై ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించేందుకు BRS సిద్ధమైంది. అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో రైతులకు మద్దతుగా నిరసనలు తెలపాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పిలుపునిచ్చారు. రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని ఎకరాకు ఏడాదికి రూ.15వేల ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ.12వేలే ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహమని మండిపడ్డారు.