News January 1, 2025
విశాఖ జైల్లో బయటపడిన ఫోన్లు అతనివేనా?
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ మాజీ MP ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ కేసులో కీలక ముద్దాయి కోలా హేమంత్ కుమార్ కదలికలపై జైలు అధికారులు నిఘా పెట్టారు. ఈ మేరకు సెంట్రల్ జైలులో అతని వద్ద 3సెల్ ఫోన్లు గుర్తించినట్లు తెలుస్తోంది. జైల్లో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఫోన్లు బయటపడటం చర్చనీయాంశమైంది. ఎవరు లోపలికి తీసుకొచ్చారు, ఎన్ని రోజులుగా వాడుతున్నారనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Similar News
News January 6, 2025
గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు..!
వైజాగ్ నుంచి సికింద్రాబాద్‌కు ఆదివారం బయలుదేరిన గోదావరి ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో పొగతో పాటు కాలిన వాసన రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి 1గంట సమయంలో ఖమ్మం సమీపంలోకి ట్రైన్ చేరుకునే సరికి B1 కోచ్‌లో ఫైర్ అలారం మోగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రైలును సుమారు 45min నిలిపి సమస్య పరిష్కరించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
News January 6, 2025
విశాఖ: ‘8న జరగాల్సిన పరీక్ష 11కు వాయిదా’
కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా కైలాసగిరి రిజర్వు పోలీస్ మైదానంలో జరుగుతున్న దేహదారుఢ్య పరీక్షల్లో అధికారులు స్వల్ప మార్పు చేశారు. ఈ నెల 8న జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలను 11వ తేదీకి వాయిదా వేసినట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఛైర్మన్ ఎం.రవి ప్రకాశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు పీఈటీ పరీక్షలు జరిగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అభ్యర్థులు గమనించాలని కోరారు.
News January 5, 2025
బీచ్ హ్యాండ్ బాల్ విజేతగా విశాఖ జట్టు
అచ్యుతాపురం మండలం పూడిమడకలో రెండు రోజుల పాటు నిర్వహించిన బీచ్ హ్యాండ్‌బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో విజేతగా విశాఖ జట్టు నిలిచింది. రన్నర్‌గా కర్నూలు జట్టు, మూడవ స్థానంలో ప్రకాశం జట్టు నిలిచాయి. విజేతలకు బహుమతులను జనసేన ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల కోఆర్డినేటర్ సుందరపు సతీశ్ కుమార్ అందజేశారు. ఈ పోటీలు విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.