News January 1, 2025

నేడు న్యూ ఇయర్ వేడుకల్లో కేటీఆర్

image

TG: బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ నేడు నూతన సంవత్సర వేడుకల్లో పాలుపంచుకోనున్నారు. ఉదయం 10.30 గంటలకు తెలంగాణ భవన్‌లో నిర్వహించే సంబురాల్లో ఆయన భాగం కానున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ క్యాలెండర్‌ను కేటీఆర్ విడుదల చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం పార్టీ నేతలతో కలిసి ముచ్చటిస్తారని, వారి నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తారని వెల్లడించాయి.

Similar News

News January 6, 2025

కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా

image

AP: పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు కొన్ని జిల్లాల్లో వాయిదా పడ్డాయి. వైకుంఠ ఏకాదశి, ఇతర లా అండ్ ఆర్డర్ సమస్యల వల్ల వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో జనవరి 8న జరగాల్సిన పరీక్షలను జనవరి 11న.. అనంతపురంలో 8-10వరకు జరగాల్సిన పరీక్షలను 17-20, చిత్తూరులో 8, 9న జరగాల్సిన ఎగ్జామ్స్‌ను 17, 18 తేదీలకు మార్చినట్లు పేర్కొంది.

News January 6, 2025

నేటి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు నేటి నుంచి 2 రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. సోమవారం ద్రవిడ వర్సిటీలో ‘స్వర్ణ కుప్పం విజన్-2029’ డాక్యుమెంట్ విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అలాగే కుప్పం (M) నడిమూరులో గృహాలపై ఏర్పాటు చేసిన సోలార్ పలకల పైలెట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారని తెలిపాయి. రేపు కుప్పం టీడీపీ ఆఫీసుకు వెళ్లనున్న చంద్రబాబు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలను కలవనున్నారు.

News January 6, 2025

రేసింగ్ కేసు.. ఇవాళ విచారణకు కేటీఆర్!

image

TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి KTR ఇవాళ ఉ.10.30 గం.లకు ACB ఎదుట హాజరుకానున్నారు. UKకు చెందిన రేసింగ్ నిర్వహణ సంస్థకు రూ.45.71కోట్లు నిబంధనలకు విరుద్ధంగా చెల్లించినట్లు ఆయనపై అభియోగాలున్నాయి. దీనిపై విచారణ చేపట్టిన ACB విచారణకు రావాలంటూ ఈనెల 3న కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. ఇదే కేసుపై దర్యాప్తు జరుపుతున్న ఈడీ ఈనెల 7న(రేపు) తమ ఎదుట హాజరుకావాలని ఆయనకు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.