News January 1, 2025

వైసీపీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎస్కే గిరి

image

వైసీపీ అధ్యక్షుడు వైస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడిగా హొళగుంద మండలానికి చెందిన ఎస్‌కే గిరిని మంగళవారం నియమించారు. ఎస్‌కే గిరి మాట్లాడుతూ.. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన వైస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే విరుపాక్షికి రుణపడి ఉంటానన్నారు.

Similar News

News January 26, 2026

వ్యవసాయ శకటానికి మొదటి స్థానం: కలెక్టర్

image

77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధ్యక్షతన పోలీస్ పరేడ్ మైదానంలో ప్రదర్శించిన శకటాల ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. వ్యవసాయ శాఖ శకటానికి మొదటి బహుమతి, దేవాదాయ శాఖ శకటానికి 2వ బహుమతి, జిల్లా విద్యా శాఖ, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ శకటాలకు 3వ బహుమతిని కలెక్టర్ ప్రకటించారు. అనంతరం వారికి జేసీ, ఎస్పీలతో కలిసి జ్ఞాపకలను అందజేశారు.

అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం: కలెక్టర్

image

సమిష్టి కృషితో జిల్లాని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుదామని కలెక్టర్ ఏ.సిరి అన్నారు. సోమవారం కర్నూలులో 77వ గణతంత్ర వేడుకలలో భాగంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరల్ ఖమర్‌తో కలిసి కలెక్టర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని కలెక్టర్ చదివి ప్రజలకు వినిపించారు. అంతకుముందు వారు ఆయుధ దళాల నుంచి గౌరవ వందనాలు స్వీకరించారు.