News January 1, 2025
కేరళ నర్సుకు యెమెన్‌లో ఉరిశిక్ష
కేరళకు చెందిన నిమిష ప్రియ అనే నర్సు 2011లో భర్తతో కలిసి యెమెన్‌లో స్థిరపడ్డారు. ఆదిబ్ మెహదీ అనే స్థానికుడిని భాగస్వామిగా చేసుకుని క్లినిక్ ప్రారంభించారు. భర్త స్వదేశానికి వచ్చిన సమయంలో మెహదీ ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో ఆమె మత్తు మందు ఇవ్వగా, డోసు ఎక్కువై అతడు మరణించాడు. ఈ కేసు విషయంలో 2017 నుంచి ప్రియ యెమెన్ జైల్లోనే ఉన్నారు. తాజాగా ఆ దేశాధ్యక్షుడు ఆమెకు మరణశిక్ష ఖరారు చేశారు.
Similar News
News January 6, 2025
చర్లపల్లి రైల్వే టర్మినల్ నేడే ప్రారంభం
TG: సకల హంగులతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను PM మోదీ ఇవాళ ఉదయం వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు హాజరవుతారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా రూ.413 కోట్ల వ్యయంతో ఈ టర్మినల్ నిర్మించారు. సికింద్రాబాద్‌కు బదులుగా ఇకపై చాలా రైళ్లు ఇక్కడే హాల్టింగ్ తీసుకుంటాయి.
News January 6, 2025
కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా
AP: పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు కొన్ని జిల్లాల్లో వాయిదా పడ్డాయి. వైకుంఠ ఏకాదశి, ఇతర లా అండ్ ఆర్డర్ సమస్యల వల్ల వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో జనవరి 8న జరగాల్సిన పరీక్షలను జనవరి 11న.. అనంతపురంలో 8-10వరకు జరగాల్సిన పరీక్షలను 17-20, చిత్తూరులో 8, 9న జరగాల్సిన ఎగ్జామ్స్‌ను 17, 18 తేదీలకు మార్చినట్లు పేర్కొంది.
News January 6, 2025
నేటి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన
AP: సీఎం చంద్రబాబు నేటి నుంచి 2 రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. సోమవారం ద్రవిడ వర్సిటీలో ‘స్వర్ణ కుప్పం విజన్-2029’ డాక్యుమెంట్ విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అలాగే కుప్పం (M) నడిమూరులో గృహాలపై ఏర్పాటు చేసిన సోలార్ పలకల పైలెట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారని తెలిపాయి. రేపు కుప్పం టీడీపీ ఆఫీసుకు వెళ్లనున్న చంద్రబాబు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలను కలవనున్నారు.