News January 1, 2025
హైదరాబాద్‌లో 1184 డ్రంక్&డ్రైవ్ కేసులు

హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత అర్ధరాత్రి 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ జోన్‌లో అత్యధికంగా 236, సౌత్ ఈస్ట్ జోన్‌లో 192, వెస్ట్ జోన్‌లో 179, నార్త్ జోన్ 177, సెంట్రల్ జోన్ 102, సౌత్ వెస్ట్ జోన్‌లో 179 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News January 16, 2026
మళ్లీ తగ్గనున్న ఉష్ణోగ్రతలు.. 10 రోజులు జాగ్రత్త!

TG: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకున్నాయని ఊపిరి పీల్చుకునేలోపే మళ్లీ చలి తీవ్రత పెరగనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు వెస్ట్ తెలంగాణలో ఇవాళ రాత్రి సగటు ఉష్ణోగ్రతలు 12-14 డిగ్రీలుగా నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. రాబోయే 10 రోజులు ఈ తరహా వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. పగటి సమయంలో ఉష్ణోగ్రతలు 29-30 డిగ్రీలుగా ఉంటాయని వెల్లడించారు.
News January 16, 2026
ప్రజల నమ్మకానికి నిదర్శనం.. ముంబై రిజల్ట్స్‌పై అమిత్ షా

దేశం దృష్టిని ఆకర్షించిన BMC ఎన్నికల్లో BJP నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం దాదాపు ఖరారైంది. 227 వార్డులకుగానూ 129 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. 72 స్థానాలతో ఠాక్రే సోదరుల కూటమి తర్వాతి స్థానంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 15 సీట్లలోనే ప్రభావం చూపుతోంది. NDA ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, విధానాలపై ప్రజలకున్న విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
News January 16, 2026
ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి: లోకేశ్

AP: రాష్ట్రానికి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి రానుందని మంత్రి లోకేశ్ ప్రకటించారు. ‘AM గ్రీన్’ కంపెనీ కాకినాడలో 1.5 మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఎక్స్‌పోర్ట్ టర్మినల్ ఏర్పాటు చేయబోతుందని, దీనివల్ల 8వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని ట్వీట్ చేశారు. ఇక్కడ ఉత్పత్తి అయిన అమ్మోనియాను జపాన్, జర్మనీ, సింగపూర్‌కు ఎగుమతి చేస్తారని పేర్కొన్నారు.


