News January 1, 2025

NEW YEAR: తెలుగు సినిమాల కొత్త పోస్టర్లు చూశారా?

image

న్యూ ఇయర్ సందర్భంగా పలు టాలీవుడ్ సినిమాల నుంచి పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, సిద్ధూ జొన్నలగడ్డ ‘తెలుసు కదా తదితర సినిమాలు పోస్టర్లను రిలీజ్ చేశాయి. 2025లో మీరు ఏ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో కామెంట్ చేయండి.

Similar News

News February 24, 2026

‘యంగ్ అండ్ ఫిట్’గా ఉన్నా.. ఈ క్యాన్సర్లు రావొచ్చు!

image

వయసుతో సంబంధం లేకుండా యువతలోనూ 6 రకాల క్యాన్సర్లు వేగంగా విస్తరిస్తున్నాయని హార్వర్డ్ స్టడీ హెచ్చరించింది. ముఖ్యంగా కొలొరెక్టల్, సర్వైకల్, క్లోమ, ప్రోస్టేట్, కిడ్నీ క్యాన్సర్లతో పాటు మల్టిపుల్ మైలోమా కేసులు యూత్‌లో పెరుగుతున్నాయి. ఒబెసిటీ, పొల్యూషన్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం దీనికి కారణాలు. ఆరోగ్యంగా ఉన్నామనే అపోహతో టెస్ట్‌లు చేయించుకోకపోతే వ్యాధి ముదిరి మరణాల రిస్క్ పెరుగుతోందని తేలింది.

News February 24, 2026

ఏ రాశివారు ఏ మంత్రం పఠించాలి? (1/2)

image

మేష రాశి : ఓం శ్రీం లక్ష్మీనారాయణాయ నమః
వృషభ రాశి : ఓం గోపాలాయ ఉత్తర ధ్వజాయ నమః
మిథున రాశి : ఓం క్లీం కృష్ణాయ నమః
కర్కాటక రాశి : ఓం హిరణ్యగర్భాయ అవ్యక్తరూపిణే నమః
సింహ రాశి : ఓం క్లీం బ్రహ్మనే జగదాధారాయ నమః
కన్యా రాశి : ఓం హ్రీం పీతాంబరాయ నమః

News February 24, 2026

అలాంటి పత్తి విత్తనాలను కొనొద్దు

image

TG: కేంద్రం అనుమతి లేని HT(Herbicide tolerant) పత్తి విత్తనాలను రాష్ట్రంలో అమ్మకుండా అరికట్టాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ పత్తి విత్తనాలు ఫీల్డ్ ట్రయల్స్‌లో విఫలమయ్యాయి. పర్యావరణానికి హాని కలుగుతుందని ఈ విత్తనాల వినియోగానికి కేంద్రం అనుమతి ఇవ్వలేదు. ఈ పత్తి విత్తనాలను సాగు చేసినా, అమ్మినా, కొనుగోలు చేసినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.