News January 1, 2025
త్వరలోనే కత్తిపూడి-ఒంగోలు హైవే విస్తరణ

AP: కోస్తా తీరంలో కీలకమైన కత్తిపూడి-ఒంగోలు హైవే విస్తరణకు అడుగులు పడుతున్నాయి. దీనిని 4, 6 వరుసలుగా విస్తరించేందుకు DPR తయారు చేయాలని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం ఈ రోడ్డు 2 వరుసలుగా ఉంది. 390KM ఉండే ఈ రహదారిలో తొలుత కత్తిపూడి నుంచి మచిలీపట్నం బైపాస్ వరకు, రెండో దశలో మచిలీపట్నం నుంచి ఒంగోలు వరకు విస్తరణ పనులు చేపడతారు. అలాగే ఆకివీడు నుంచి పాలకొల్లు వరకు 40కి.మీ విస్తరణ కూడా జరగనుంది.
Similar News
News January 21, 2026
రైలును పట్టాలు తప్పించే కుట్ర!

మహారాజా ఎక్స్‌ప్రెస్‌కు పెను ముప్పు తప్పింది. రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలో రైలును పట్టాలు తప్పించేందుకు దుండగులు కుట్ర చేశారు. పట్టాలపై ఇనుప కడ్డీలను పెట్టారు. లోకో పైలట్ వెంటనే గుర్తించి ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. నిన్న రాత్రి 11.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమయంలో రైలులో పెద్ద సంఖ్యలో విదేశీ టూరిస్టులు ఉన్నారు. ఇనుప కడ్డీలను తొలగించి, డాగ్ స్క్వాడ్, పోలీసుల తనిఖీల తర్వాత రైలును పంపారు.
News January 21, 2026
దావోస్‌లో కేటుగాళ్లు.. బిలియనీర్లకే బురిడీ

దావోస్‌లో కేటుగాళ్లు మాటువేశారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో బిలియనీర్లను బురిడీ కొట్టిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశమయ్యేందుకు ‘USA హౌస్’లోకి వీఐపీ యాక్సెస్ కల్పిస్తామని మోసాలకు పాల్పడుతున్నారు. కొందరు స్కామర్లు నకిలీ టికెట్లను విక్రయించడం గమనార్హం. ఈ విషయం బయటపడటంతో జాగ్రత్తగా ఉండాలంటూ బిలియనీర్లను USA హౌస్ హెచ్చరించింది. ‘మోసపోయిన వారికి మా సానుభూతి’ అంటూ పేర్కొంది.
News January 21, 2026
రెహమాన్ గొప్ప కంపోజర్, మంచి వ్యక్తి: RGV

‘జయహో’ పాట విషయంలో ఏఆర్ రెహమాన్‌పై తన <<18913562>>వ్యాఖ్యలను<<>> తప్పుగా అర్థం చేసుకున్నారని ఆర్జీవీ ట్వీట్ చేశారు. తన దృష్టిలో రెహమాన్ గొప్ప కంపోజర్ అని, తాను కలిసినవారిలోకెల్లా మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. ఇతరుల క్రెడిట్ తీసుకునేవారిలో చివర ఉండేది ఆయనేనని ఆర్జీవీ స్పష్టం చేశారు. ఇప్పటికైనా నెగటివ్ ప్రచారానికి ముగింపు పలుకుతారని ఆశిస్తున్నట్లు Xలో రాసుకొచ్చారు.


