News January 1, 2025
2025లో ప్రపంచయుద్ధం?
నోస్ట్రడామస్, బాబా వంగా ఇద్దరూ ఎన్నో ఏళ్ల ముందుగానే పలు ఘటనల్ని కచ్చితత్వంతో అంచనా వేశారు. 2025 గురించి వీరు చెప్పిన జోస్యం పాశ్చాత్య దేశాల ప్రజల్ని భయపెడుతోంది. ఈ ఏడాది ఐరోపాలో ప్రపంచయుద్ధం స్థాయిలో పరిస్థితులు నెలకొంటాయని వారు చెప్పారు. బ్రిటన్‌లో మహమ్మారి తిరిగి వస్తుందని, USలో ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని అన్నారు. ప్రపంచ ఆధిపత్యం తూర్పుదేశాల చేతికి వస్తుందని జోస్యం చెప్పారు.
Similar News
News January 6, 2025
7న తిరుమలలో VIP బ్రేక్ దర్శనాలు రద్దు
AP: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఏర్పాట్లు చేసింది. జనవరి 10-19 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. ద్వార దర్శనాలను పురస్కరించుకుని జనవరి 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. దీంతో ఆ రోజు VIP బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. 6న సిఫార్సు లేఖలను స్వీకరించబోమని ఓ ప్రకటనలో తెలిపింది.
News January 6, 2025
జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా?
TGలో ఉష్ణోగ్రతలు పడిపోవడం, కాలుష్య తీవ్రత వల్ల వైరల్ ఫీవర్స్, ఫ్లూ వైరస్ వ్యాప్తి బాగా పెరిగింది. దీంతో దాదాపు ప్రతి ఇంట్లో ఒక్కరైనా జ్వరం/దగ్గు/జలుబుతో బాధపడుతున్నారు. కొందరిని గొంతు ఇన్ఫెక్షన్ వేధిస్తోంది. మరోవైపు చైనాలో విజృంభిస్తున్న HMPV వైరస్ లక్షణాలు కూడా ఇలాగే ఉండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఏ లక్షణాలతో ఎక్కువమంది ఆసుపత్రుల్లో చేరుతున్నారనే వివరాలను సేకరిస్తోంది. మీరూ జ్వరబాధితులేనా?
News January 6, 2025
చర్లపల్లి రైల్వే టర్మినల్ నేడే ప్రారంభం
TG: సకల హంగులతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను PM మోదీ ఇవాళ ఉదయం వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు హాజరవుతారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా రూ.413 కోట్ల వ్యయంతో ఈ టర్మినల్ నిర్మించారు. సికింద్రాబాద్‌కు బదులుగా ఇకపై చాలా రైళ్లు ఇక్కడే హాల్టింగ్ తీసుకుంటాయి.