News January 1, 2025

తగ్గిన సిలిండర్ ధర

image

కొత్త ఏడాదిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది. రూ.14.50 తగ్గడంతో ఢిల్లీలో గ్యాస్ ధర రూ.1804కు చేరింది. ప్రస్తుతం HYDలో సిలిండర్ ధర రూ.2014గా ఉంది. ఇవాళ్టి నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. మరోవైపు 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా ప్రతినెల ఒకటో తేదీన సిలిండర్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేస్తాయి.

Similar News

News January 6, 2025

ట్రెండింగ్‌లో #lockdown

image

దేశంలో hMPV కేసులు నమోదవుతుండటంతో ట్విటర్లో lockdown హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. లాక్‌డౌన్ పెట్టాలని, WFH అమలు చేయాలని కొందరు నెటిజన్లు కోరుతున్నారు. ఇంకొందరు మీమ్స్ షేర్ చేస్తున్నారు. మరికొందరేమో బాధ్యతగా, మానవతా దృక్పథంతో నడుచుకోవాలని సూచిస్తున్నారు. కొవిడ్ లాక్‌డౌన్లో ఎంతో మంది ఉపాధి, సన్నిహితులను కోల్పోయి చిత్రవధ అనుభవించారని గుర్తు చేస్తున్నారు. ఫార్మా మాఫియాను నిందిస్తున్నారు.

News January 6, 2025

సమయం లేదు.. అపాయింట్‌మెంట్ కోరిన రైతు సంఘాలకు రాష్ట్రపతి రిప్లై

image

స‌మస్య‌ల‌పై విన్న‌వించ‌డానికి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దీ ముర్ము అపాయింట్‌మెంట్ కోరిన రైతు సంఘాల‌కు నిరాశే ఎదురైంది. స‌మ‌యం లేక‌పోవ‌డం వ‌ల్ల కలవడానికి వీలుకుద‌ర‌డం లేద‌ని రాష్ట్ర‌ప‌తి సందేశం పంపారు. రైతు సంఘం నేత ద‌ల్లేవాల్ దీక్ష‌, పంట‌ల‌కు స‌రైన ధ‌ర‌లు లేక‌పోవ‌డం, ఉత్పత్తి వ్యయాలు పెరగడం, అప్పులు వంటి స‌మ‌స్య‌లుపై విన‌తిప‌త్రం ఇచ్చేందుకు సంయుక్త కిసాన్ మోర్చా ఇటీవ‌ల రాష్ట్ర‌ప‌తి అపాయింట్‌మెంట్ కోరింది.

News January 6, 2025

ఆ ట్రోల్స్ వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లా: మీనాక్షి చౌదరి

image

విజయ్ నటించిన ‘ది గోట్’ మూవీ తర్వాత తన నటనపై కొందరు ట్రోల్స్ చేయడంతో డిప్రెషన్‌లోకి వెళ్లానని హీరోయిన్ మీనాక్షి చౌదరి తెలిపారు. దీని నుంచి కొన్ని రోజులు తేరుకోలేకపోయానని ఆమె చెప్పారు. ‘లక్కీ భాస్కర్’ సక్సెస్ తర్వాత కథల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నానని పేర్కొన్నారు. మీనాక్షి నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు.