News January 1, 2025

BGT: పుజారాను సెలక్టర్లే వద్దన్నారా?

image

BGTలో సీనియర్ బ్యాటర్ పుజారాను ఆడించాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భావించినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. కానీ ఆయన ప్రతిపాదనను సెలక్టర్లు తిరస్కరించారని పేర్కొన్నాయి. నాలుగో టెస్టులో ఓటమి అనంతరం ఆటగాళ్లపై గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశారని, పరిస్థితులకు తగ్గట్లు ఆడట్లేదని ఆగ్రహించినట్లు సమాచారం. దీనిపై బీసీసీఐ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా AUSలో 11 మ్యాచులు ఆడిన పుజారా 47.28 AVGతో 993 రన్స్ చేశారు.

Similar News

News January 6, 2025

OTTల్లో ఈ సినిమాలు చూశారా?

image

గతేడాది కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. అవి ఏ ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతున్నాయో చూద్దాం.
*దేవర, లక్కీ భాస్కర్, అమరన్, సత్యం సుందరం, మహారాజ, ఆడు జీవితం, సరిపోదా శనివారం- నెట్‌ఫ్లిక్స్
*ప్రేమలు, కిల్- డిస్నీ+హాట్‌స్టార్
*కల్కి- అమెజాన్ ప్రైమ్
*హనుమాన్- ZEE5, జియో సినిమా
>>ఇంకా మీకు నచ్చిన సినిమాలేవో కామెంట్ చేయండి.

News January 6, 2025

ఏడాదిలో ₹లక్షన్నర కోట్ల అప్పు.. ఆ డబ్బంతా ఎటు పోయింది: KTR

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో ₹లక్షన్నర కోట్ల అప్పు చేసిందని, ఆ డబ్బంతా ఏమైందని KTR ప్రశ్నించారు. ‘6 గ్యారంటీలు, రుణమాఫీ, రైతు భరోసా, ₹4వేల పింఛను, మహిళలకు ₹2,500, తులం బంగారం ఇవ్వనేలేదు. అయినా అప్పు ఎందుకయింది?’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. BRS ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఎన్నో పథకాలు ఇచ్చిందని, పదేళ్లలో ₹4 లక్షల కోట్ల అప్పు చేసిన KCR సర్కారుపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

News January 6, 2025

విడాకుల రూమర్స్.. ‘అతడి’తో ధనశ్రీ ఫొటో వైరల్

image

క్రికెటర్ చాహల్, భార్య ధనశ్రీ విడాకులు తీసుకోనున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఓ ఫొటో SMలో తెగ వైరల్ అవుతోంది. అదే తన ఫ్రెండ్, కొరియోగ్రాఫర్ ప్రతీక్‌తో గతంలో ధనశ్రీ సన్నిహితంగా దిగిన ఫొటో. ఈ పిక్ బయటికొచ్చినప్పుడే అప్పట్లో ధనశ్రీపై చాహల్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఎంత ఫ్రెండ్ అయినా మరీ ఇలా ఉంటారా? అని ప్రశ్నించారు. తాజాగా విడాకుల రూమర్స్ రావడంతో ఆ ఫొటోను మరోసారి వైరల్ చేస్తున్నారు.