News January 1, 2025
విశ్వ వేదికపై విజయ గీతికగా TG ప్రస్థానం ఉండాలి: CM
TG: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘నవ వసంతంలో విశ్వ వేదికపై విజయ గీతికగా తెలంగాణ స్థానం, ప్రస్థానం ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ నూతన సంవత్సరం శుభ సంతోషాలను నింపాలని మనసారా కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి,రజినీకాంత్, కమల్ హాసన్, ఎన్టీఆర్ తదితరులు కూడా X వేదికగా న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు.
Similar News
News January 6, 2025
భార్య టార్చర్ చేస్తోందని భర్త ఆత్మహత్య
భార్య వేధింపులు తట్టుకోలేక మరో భర్త బలయ్యాడు. గుజరాత్ జమరాలకు చెందిన సురేశ్కు 17 ఏళ్ల క్రితం పెళ్లైంది. అతడికి నలుగురు పిల్లలు ఉన్నారు. భార్య జయ తనను మానసికంగా టార్చర్ చేస్తోందని సురేశ్ ఆత్మహత్యకు ముందు వీడియో రికార్డు చేశాడు. తన చావుకు కారణమైనందుకు జీవితాంతం గుర్తుంచుకునేలా ఆమెకు గుణపాఠం చెప్పాలని అందులో కోరాడు. సురేశ్ తండ్రి ఫిర్యాదుతో పోలీసులు జయపై కేసు నమోదు చేశారు.
News January 6, 2025
తెల్లారే పెన్షన్లు ఇవ్వాలా?: వెంకట్రామిరెడ్డి
AP: రాష్ట్రంలో తెల్లారే పెన్షన్లు ఇవ్వకపోతే ప్రపంచం తలకిందులవుతుందా అని రాష్ట్ర గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం అంటే ఇదేనా? అని నిలదీశారు. వేరే ఊరిలో ఉన్న మహిళా ఉద్యోగి పెన్షన్లు ఇవ్వడానికి ఎన్నిగంటలకు నిద్రలేచి రావాలో గమనించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా IR, పెండింగ్ డీఏల్లో ఒకటైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
News January 6, 2025
మహిళ పొట్టలో 58 డ్రగ్ క్యాప్సుల్స్
బ్రెజిల్కు చెందిన ఇద్దరు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ ఢిల్లీ ఎయిర్పోర్టులో పట్టుబడ్డారు. డ్రగ్ క్యాప్సుల్స్ మింగిన వీరిని కస్టమ్స్ టీం గుర్తించగా, ప్రాథమిక విచారణలో కొన్నింటిని నిందితులే వెలికితీశారు. ఆపై ఆస్పత్రికి తరలించి శస్త్ర చికిత్స చేసి పురుషుడి కడుపులోనుంచి 937గ్రా.బరువున్న 105, మహిళ నుంచి 562గ్రా. 58 క్యాప్సుల్స్ బయటకు తీశారు. వీటి విలువ రూ.20cr ఉంటుందని అధికారులు చెప్పారు.