News January 1, 2025
SHOCKING.. ఎంత తాగావు బ్రో?
HYD బంజారాహిల్స్‌లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో షాకింగ్ రీడింగ్ నమోదైంది. వెంగళరావు పార్క్ సమీపంలో నిన్న రాత్రి 10.50 గంటల సమయంలో బైక్(TS09EK3617)పై వెళ్తున్న వ్యక్తిని ఆపి బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేశారు. అందులో 550 రీడింగ్ వచ్చింది. దీంతో రీడింగ్ చలాన్ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతుండగా, ఎంత తాగావు బ్రో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 30 దాటితే కేసు నమోదు చేస్తారు.
Similar News
News January 6, 2025
ఏడాదిలో ₹లక్షన్నర కోట్ల అప్పు.. ఆ డబ్బంతా ఎటు పోయింది: KTR
TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో ₹లక్షన్నర కోట్ల అప్పు చేసిందని, ఆ డబ్బంతా ఏమైందని KTR ప్రశ్నించారు. ‘6 గ్యారంటీలు, రుణమాఫీ, రైతు భరోసా, ₹4వేల పింఛను, మహిళలకు ₹2,500, తులం బంగారం ఇవ్వనేలేదు. అయినా అప్పు ఎందుకయింది?’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. BRS ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఎన్నో పథకాలు ఇచ్చిందని, పదేళ్లలో ₹4 లక్షల కోట్ల అప్పు చేసిన KCR సర్కారుపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
News January 6, 2025
విడాకుల రూమర్స్.. ‘అతడి’తో ధనశ్రీ ఫొటో వైరల్
క్రికెటర్ చాహల్, భార్య ధనశ్రీ విడాకులు తీసుకోనున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఓ ఫొటో SMలో తెగ వైరల్ అవుతోంది. అదే తన ఫ్రెండ్, కొరియోగ్రాఫర్ ప్రతీక్‌తో గతంలో ధనశ్రీ సన్నిహితంగా దిగిన ఫొటో. ఈ పిక్ బయటికొచ్చినప్పుడే అప్పట్లో ధనశ్రీపై చాహల్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఎంత ఫ్రెండ్ అయినా మరీ ఇలా ఉంటారా? అని ప్రశ్నించారు. తాజాగా విడాకుల రూమర్స్ రావడంతో ఆ ఫొటోను మరోసారి వైరల్ చేస్తున్నారు.
News January 6, 2025
ఈనెల 25లోపు రెండో విడత కాటమయ్య కిట్లు: మంత్రి
TG: కల్లు గీత కార్మికులకు రెండో విడతలో భాగంగా 10 వేల కాటమయ్య రక్షణ కవచం కిట్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈనెల 25లోపు పంపిణీ పూర్తి చేస్తామన్నారు. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మందికి కిట్లు ఇచ్చామని తెలిపారు. గత ఏడాది జులై 14న రంగారెడ్డి (D) లష్కర్ గూడలో సీఎం రేవంత్ కాటమయ్య కిట్ల పంపిణీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.