News January 1, 2025
రైళ్ల టైమింగ్స్‌లో మార్పులు

తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే 94 రైళ్ల టైమ్ టేబుల్‌లో ఇవాళ్టి నుంచి మార్పులు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఇందులో తిరుపతి-కాకినాడ, తిరుపతి-ఆదిలాబాద్, లింగంపల్లి-విశాఖ, షాలిమర్-హైదరాబాద్, హైదరాబాద్-తాంబరం సహా పలు రైళ్లు ఉన్నాయి. అలాగే మరికొన్ని రైళ్లకు కొన్ని స్టేషన్లలో కొత్తగా హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. రైళ్ల వివరాల కోసం ఇక్కడ <
Similar News
News January 14, 2026
రూ.15,000 పెరిగిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీపై ఏకంగా రూ.15,000 పెరిగి రూ.3,07,000కు చేరింది. బంగారం ధరలు సైతం గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,090 ఎగబాకి రూ.1,43,620కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,000 పెరిగి రూ.1,31,650గా ఉంది. 3 రోజుల్లో కేజీ వెండి ధర రూ.32,000 పెరగడం గమనార్హం.
News January 14, 2026
దారుణం.. విష ప్రయోగంతో 600 కుక్కలు మృతి

TG: కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. వీధికుక్కలపై విషప్రయోగం జరగడంతో దాదాపు 500-600 శునకాలు మృతిచెందాయి. మాచారెడ్డి(M) ఫరీద్‌పేట్, భవానీపేట, వాడి, పల్వంచలో నూతనంగా ఎంపికైన సర్పంచ్‌లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనపై ‘గౌతమ్ స్ట్రే యానిమల్స్ ఫౌండేషన్’ ప్రతినిధులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
News January 14, 2026
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 పోస్టులు

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ అర్హతగల వారి నుంచి జనవరి 15 నుంచి 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: bankofmaharashtra.bank.in


