News January 1, 2025
అజిత్ సినిమా వాయిదా.. గేమ్ ఛేంజర్‌కు బూస్ట్?
సంక్రాంతికి (JAN 10) రిలీజ్ కాబోతున్న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’కు తమిళనాడులో పెద్ద పోటీ తప్పింది. అజిత్ ‘విదాముయార్చి’ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. దీంతో అక్కడ పొంగల్ రేసులో పెద్ద సినిమాలేవీ లేవు. పాజిటివ్ టాక్ వస్తే ‘గేమ్ ఛేంజర్’ భారీ వసూళ్లు రాబట్టవచ్చని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. బాల దర్శకత్వం వహించిన ‘వనంగాన్’ రిలీజవుతున్నా దాని ప్రభావం GC వసూళ్లపై అంతగా ఉండకపోవచ్చని అంటున్నాయి.
Similar News
News January 6, 2025
కోహ్లీ వద్ద ఇంకా చాలా రన్స్ ఉన్నాయి: పాంటింగ్
సిడ్నీ టెస్టు 2వ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఔట్ అవగానే అసహనానికి గురైన విషయం తెలిసిందే. దీనిపై ఆసీస్ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. ఒకే తరహాలో పదే పదే పెవిలియన్‌కు చేరుతుండటంపై కోహ్లీ తనపై తానే కోపం చూపించుకున్నాడని చెప్పారు. విరాట్‌కు ఈ సిరీస్ కచ్చితంగా నిరాశ కలిగించిందన్నారు. కానీ అతని వద్ద ఇంకా చాలా పరుగులు ఉన్నాయని ఆయన చెప్పారు. BGTలో కోహ్లీ 190పరుగులే చేశారు.
News January 6, 2025
నేడు పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ
AP: మాజీ మంత్రి పేర్ని నాని వేసిన బెయిల్ ముందస్తు పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఆయన ఫ్యామిలీకి చెందిన గోదాములో రేషన్ బియ్యం మాయమైన ఘటనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా పేర్ని నాని ఫ్యామిలీ ఉండగా, ఆయన భార్యకు మచిలీపట్నం కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పేర్ని నాని ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా నేడు విచారణ జరగనుంది.
News January 6, 2025
చట్టాలు మార్చాల్సిన టైమ్ వచ్చిందా?
కొంత మంది భార్యలు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మగవాళ్లు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ మొత్తంపై కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోతున్నారు. భారత చట్టాలు వారికే అనుకూలంగా ఉన్నాయని, వాటిని మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఏ నేరం చేయకపోయినా ఎందుకు బలవ్వాలని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?