News March 16, 2024

ఇక సెలవు.. 125 ఏళ్ల తాబేలు మృతి

image

HYDలోని జవహర్‌లాల్ నెహ్రూ జూలో 125 ఏళ్ల వయసు గల రాక్షసుడు అనే మగ తాబేలు ప్రాణాలు విడిచింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. 10 రోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోవడం లేదని జూ అధికారులు తెలిపారు. 1963లో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ నుంచి ఈ తాబేలును జూపార్క్‌కు తరలించగా.. అప్పట్నుంచి ఇక్కడే ఉంది. ఇన్నేళ్ల పాటు దానికి సేవలు చేసిన వారు భావోద్వేగానికి గురవుతున్నారు. తాబేళ్ల జీవితకాలం 80-150 ఏళ్లు.

Similar News

News December 30, 2024

దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరంటే?

image

భారత్‌లో రిచెస్ట్ CMగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (₹931కోట్లు) నిలిచారు. ఆయన చరాస్తుల విలువ ₹810cr కాగా స్థిరాస్తుల విలువ ₹121crగా ఉంది. ఇక ఈ లిస్టులో అరుణాచల్ CM పెమా ఖండు (₹332cr) రెండో స్థానంలో, కర్ణాటక CM సిద్దరామయ్య (₹51cr) మూడో స్థానంలో ఉన్నారు. అత్యల్ప ఆస్తులున్న సీఎంగా ప.బెంగాల్ CM మమతా బెనర్జీ (₹15లక్షలు) నిలిచారు. J&K CM ఒమర్ ₹55లక్షలు, కేరళ CM విజయన్ ₹కోటి విలువ గల ఆస్తి కలిగి ఉన్నారు.

News December 30, 2024

మన్మోహన్ అస్థికల నిమజ్జనం.. విమ‌ర్శ‌ల‌పై స్పందించిన కాంగ్రెస్‌

image

మ‌న్మోహ‌న్ సింగ్ కుటుంబ సభ్యుల వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తూ ఆయన అస్థిక‌ల‌ను య‌మునా న‌దిలో క‌లిపే కార్య‌క్ర‌మంలో పార్టీ నేత‌లు పాల్గొన‌లేదని కాంగ్రెస్ వివ‌ర‌ణ ఇచ్చింది. అంత్య‌క్రియ‌ల అనంత‌రం మ‌న్మోహ‌న్ కుటుంబాన్ని వారి నివాసంలో సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ క‌లిసి పరామర్శించారని తెలిపింది. అస్థిక‌లు న‌దిలో క‌లిపే విష‌య‌మై వారితో చ‌ర్చించాకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు కాంగ్రెస్ వెల్ల‌డించింది.

News December 30, 2024

స్పేస్ డాకింగ్: నాలుగో దేశంగా భారత్

image

ISRO చేపడుతోన్న ‘స్పేడెక్స్ మిషన్’ సక్సెస్ అయితే ప్రపంచంలో స్పేస్ డాకింగ్ సాంకేతికత కలిగి ఉన్న నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది. ఈ టెక్నాలజీ విషయంలో US, రష్యా, చైనా ముందంజలో ఉన్నాయి. చంద్రయాన్-4, ఇండియన్ స్పేస్ సెంటర్ వంటి భవిష్యత్తు ప్రాజెక్టుల్లో ఈ డాకింగ్ టెక్నాలజీ కీలకంగా వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్ తెలిపారు.