News January 1, 2025

31st రోజు ఎంత మద్యం తాగారంటే?

image

కొత్త ఏడాది వస్తుందన్న ఆనందంలో మందుబాబులు కుమ్మేశారు. TG ఎక్సైజ్ శాఖ చరిత్రలో నిన్న(31st) రికార్డ్ స్థాయిలో రూ.403 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. DEC 28 నుంచి JAN 1 ఉదయం వరకు ఏకంగా రూ.1,800 కోట్ల విలువైన లిక్కర్ తాగారని ఎక్సైజ్ శాఖ తెలిపింది. గతంతో పోలిస్తే ఈ గణాంకాలు భారీగా పెరిగినట్లు పేర్కొంది. ఇక ఇవాళ కూడా సెలవు కావడంతో రాత్రి వరకు మద్యం అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

Similar News

News January 6, 2025

GOOD NEWS: వారంలో జాబ్ క్యాలెండర్?

image

AP: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, కొత్తవి కలిపి దాదాపు 3వేల పోస్టుల భర్తీ జరగనుంది. గ్రూప్-1 పోస్టులతో పాటు వివిధ శాఖల్లో ఖాళీలను నింపనున్నారు. అటు వర్సిటీలు, RGUKTల్లోని 3వేల పోస్టులకు నోటిఫికేషన్లు రానున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రకటించిన మెగా DSC(16,347 పోస్టులు) నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

News January 6, 2025

ఈ కాల్స్‌కు స్పందించకండి: TG పోలీస్

image

అంతర్జాతీయ నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు తెలంగాణ పోలీసులు సూచించారు. +97, +85 కోడ్స్‌తో ఉన్న నంబర్ల నుంచి కాల్స్ వస్తే స్పందించవద్దని తెలిపారు. RBI, ట్రాయ్ పేరిట బెదిరిస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని, ఫేక్ కాల్స్‌కు స్పందిస్తే బ్యాంకు అకౌంట్స్ ఖాళీ అవుతాయని హెచ్చరించారు. ఇలాంటి స్పామ్ కాల్స్‌పై 1930కి రిపోర్ట్ చేయాలని సూచించారు.

News January 6, 2025

పవన్‌ను అరెస్ట్ చేయాలి: వైసీపీ అధికార ప్రతినిధి

image

AP: Dy.CM పవన్‌ను అరెస్ట్ చేయాలని YCP అధికార ప్రతినిధి కె.వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన పవన్ బైక్ సైలెన్సర్లు తీసి యువకులు స్టంట్లు చేయాలని చెప్పారన్నారు. అందువల్లే ఆ ఈవెంట్‌కు వెళ్లొస్తూ ఇద్దరు యువకులు చనిపోయారని, వారి మృతికి కారణమైన ఆయన్ను అరెస్ట్ చేయాలన్నారు. అటు, TGలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతిచెందిన కేసులో బన్నీ అరెస్టైన విషయం తెలిసిందే.