News January 1, 2025

పిఠాపురానికి పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే?

image

AP: పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆరున్నర నెలల్లో తాను ఏం చేశాననే <>వివరాలను <<>>డిప్యూటీ CM పవన్ పంచుకున్నారు. 100 పడకల ఆస్పత్రికి అప్‌గ్రేడ్, రూ.2 కోట్ల అంచనాతో TTD కళ్యాణ మండపం, రూ.72లక్షలతో గొల్లప్రోలులో తాగునీటి సౌకర్యం, 32 స్కూళ్లకు క్రీడా కిట్లు, స్కూళ్లు, కాలేజీల్లో RO ప్లాంట్లు సహా మరికొన్ని పనులు చేసినట్లు చెప్పారు. అలాగే డిప్యూటీ CMగా APకి తానేం చేశాననే వివరాలనూ ఆయన షేర్ చేశారు.

Similar News

News January 6, 2025

‘డాకు మహారాజ్’లో కీలక పాత్ర పోషించిన డైరెక్టర్

image

నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ ట్రైలర్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో నేషనల్ అవార్డ్ పొందిన డైరెక్టర్ సందీప్ రాజ్ కీలక పాత్రలో కనిపించారు. దీనిపై ఆయన స్పందిస్తూ, సినిమాల్లోకి రావాలని తాను చిన్ననాటి నుంచే కలలు కన్నట్లు ట్వీట్ చేశారు. ‘ఒక్క ఫోన్ కాల్‌తో నెక్స్ట్ డే వచ్చి షూటింగ్‌లో పాల్గొన్నావ్. థాంక్స్ తమ్ముడు. అదరగొట్టావ్’ అని డైరెక్టర్ బాబీ రిప్లై ఇచ్చారు.

News January 6, 2025

గన్నవరం TDP ఆఫీసు ఘటన.. పిటిషన్లు కొట్టివేత

image

AP: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 17 మంది తమను అరెస్ట్ నుంచి కాపాడాలని కోర్టులో పిటిషన్లు వేశారు. ఈ కేసులో మొత్తం 89 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఇదే కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ A71గా ఉన్నారు.

News January 6, 2025

ICMR OFFICIAL: ఆ ఇద్దరిదీ చైనా వైరస్సే

image

భయపడుతున్నట్టే జరిగింది. బెంగళూరులోని ఇద్దరు చిన్నారులకు (3 నెలలు, 8 నెలలు) సోకింది చైనా వైరస్ HMPV అని ICMR ధ్రువీకరించింది. రొటీన్ సర్వీలియన్స్‌లో వారిలో మల్టిపుల్ రెస్పిరేటరీ వైరల్ పాథోజెన్స్‌ను గుర్తించామంది. బాధితులకు అంతర్జాతీయ ప్రయాణాల హిస్టరీ లేదని తేల్చిచెప్పింది. అయినప్పటికీ వ్యాధి రావడం అందరినీ కలవరపెడుతోంది. వీరిద్దరూ బెంగళూరులోని బాప్టిస్ట్ ఆస్పత్రిలోనే చికిత్స పొందడం గమనార్హం.