News January 1, 2025
GOOD NEWS చెప్పిన సీఎం చంద్రబాబు
AP: ముఖ్యమంత్రి సహాయనిధి(CMRF) కింద రూ.24 కోట్లు విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. నూతన సంవత్సరంలో ఈ ఫైల్పైనే తొలి సంతకం చేశారు. దీంతో దాదాపు 1,600 మంది పేదలకు సాయం అందనుంది. త్వరలోనే లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు చెక్కులను అందజేయనున్నారు. గత ఏడాది అధికారం చేపట్టినప్పటి నుంచి DEC 31 వరకు రూ.100 కోట్లకు పైగా CMRF నిధులు పేదవర్గాలకు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
Similar News
News January 6, 2025
ఆ విషయం PMతో లోకేశ్ చెప్పించగలరా?: అమర్నాథ్
AP: ఏ శాఖ మీదా అవగాహన లేకుండా సకల శాఖల మంత్రిగా లోకేశ్ తయారయ్యారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. PM మోదీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ YCP హయాంలో వచ్చినవే అని చెప్పారు. 15 ఏళ్లు సీఎంగా ఉండి ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని, అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని PMతో లోకేశ్ చెప్పించగలరా? అని అమర్నాథ్ ప్రశ్నించారు.
News January 6, 2025
HMPV వైరస్: స్టాక్ మార్కెట్లు క్రాష్
స్టాక్ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. బెంగళూరులో ప్రమాదకర HMPV వైరస్ కేసులు నమోదవ్వడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. దీంతో తమవద్దనున్న షేర్లను తెగనమ్ముతున్నారు. సెన్సెక్స్ 1200 పాయింట్లు నష్టపోయి 78,000, నిఫ్టీ 320 పాయింట్లు పతనమై 23,680 వద్ద ట్రేడవుతున్నాయి. ఫలితంగా రూ.5లక్షల కోట్లమేర సంపద ఆవిరైంది. ఇండియా విక్స్ నేడు 12.61% పెరగడం గమనార్హం. అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి.
News January 6, 2025
గ్రీన్కో నుంచి BRSకు రూ.41 కోట్లు: ప్రభుత్వం
TG: ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో ప్రభుత్వం కీలక అంశాలను బయటపెట్టింది. రేసు నిర్వహించిన గ్రీన్కో సంస్థ ద్వారా BRSకు రూ.కోట్ల లబ్ధి చేకూరినట్లు వెల్లడించింది. ఆ కంపెనీ BRSకు ఎన్నికల బాండ్ల ద్వారా రూ.41 కోట్లు చెల్లించిందని తెలిపింది. 2022 ఏప్రిల్ 8-అక్టోబర్ 10 మధ్య గ్రీన్కో, అనుబంధ సంస్థలు 26 సార్లు బాండ్లు కొన్నట్లు సర్కార్ పేర్కొంది.