News January 1, 2025

కామారెడ్డి: ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన చైతన్య రెడ్డి

image

కామారెడ్డి ఏఎస్పీగా చైతన్య రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం ఆమెను కామారెడ్డి ఏఎస్పీగా నియమించింది. ఈ మేరకు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఆమె సూచించారు.

Similar News

News January 6, 2025

NZB: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్ దిలీప్‌తో పాటు జిల్లా స్థాయి అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి వినతుల స్వీకరించారు. ప్రజావాణిలో నమోదైన ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

News January 6, 2025

NZB: కలెక్టరేట్‌ను ముట్టడించిన కార్మికులు

image

సివిల్ సప్లై కార్పొరేషన్ హమాలీలు 6వ రోజు సమ్మెలో భాగంగా కార్మికులు సోమవారం నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల నుంచి ప్రదర్శన నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. వెంటనే జీవోను విడుదల చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ అంకత్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఓమయ్య తదితరులు పాల్గొన్నారు.

News January 6, 2025

NZB: సూసైడ్ చేసుకున్న ఇంటర్ విద్యార్థిని

image

కాలేజీకి వెళ్ళమని చెప్పడంతో ఓ ఇంటర్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్‌లో చోటు చేసుకుంది. 3వ టౌన్ పరిధికి చెందిన లక్ష్య(16) ఇంటర్ మొదటి సంవత్సరం ఓ ప్రైవేటు కళాశాల హాస్టల్లో ఉంటూ చదువుతోంది. నెల రోజుల కిందట ఇంటికి వచ్చిన బాలిక తిరిగి వెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు హాస్టల్‌కు వెళ్లి చదువుకోవాలని చెప్పడంతో క్షణికావేశంలో బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.