News January 1, 2025
మేం వచ్చాక అందరికీ భవిష్యత్తుపై భరోసా: సీఎం చంద్రబాబు
AP: రాష్ట్రంలో చరిత్ర తిరగరాసిన సంవత్సరం 2024 అని సీఎం చంద్రబాబు చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. ‘గత ఐదేళ్లు ప్రజలు, మీడియా, అధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అందరికీ భవిష్యత్తుపై భరోసా వచ్చింది. రాజధాని అమరావతి నగరం ఫ్యూచర్‌లో అభివృద్ధి చెందుతుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News January 6, 2025
HMPV వైరస్: స్టాక్ మార్కెట్లు క్రాష్
స్టాక్ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. బెంగళూరులో ప్రమాదకర HMPV వైరస్ కేసులు నమోదవ్వడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. దీంతో తమవద్దనున్న షేర్లను తెగనమ్ముతున్నారు. సెన్సెక్స్ 1200 పాయింట్లు నష్టపోయి 78,000, నిఫ్టీ 320 పాయింట్లు పతనమై 23,680 వద్ద ట్రేడవుతున్నాయి. ఫలితంగా రూ.5లక్షల కోట్లమేర సంపద ఆవిరైంది. ఇండియా విక్స్ నేడు 12.61% పెరగడం గమనార్హం. అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి.
News January 6, 2025
గ్రీన్‌కో నుంచి BRSకు రూ.41 కోట్లు: ప్రభుత్వం
TG: ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో ప్రభుత్వం కీలక అంశాలను బయటపెట్టింది. రేసు నిర్వహించిన గ్రీన్‌కో సంస్థ ద్వారా BRSకు రూ.కోట్ల లబ్ధి చేకూరినట్లు వెల్లడించింది. ఆ కంపెనీ BRSకు ఎన్నికల బాండ్ల ద్వారా రూ.41 కోట్లు చెల్లించిందని తెలిపింది. 2022 ఏప్రిల్ 8-అక్టోబర్ 10 మధ్య గ్రీన్‌కో, అనుబంధ సంస్థలు 26 సార్లు బాండ్లు కొన్నట్లు సర్కార్ పేర్కొంది.
News January 6, 2025
ఛాంపియన్స్ ట్రోఫీలో వైస్ కెప్టెన్‌గా బుమ్రా!
భారత బౌలింగ్ దళాన్ని నడిపిస్తున్న బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్‌కు ఈ స్పీడ్‌గన్‌ను డిప్యూటీగా నియమించాలని BCCI భావిస్తోంది. కాగా, ఈ రేసులో శ్రేయస్ అయ్యర్, పంత్, హర్దిక్, సూర్యకుమార్ ఉన్నా జట్టు భవిష్యత్ ప్రణాళికల నేపథ్యంలో బుమ్రాకే మొగ్గుచూపినట్లు సమాచారం. CT FEB 19న ప్రారంభం కానుంది. భారత్ తొలి మ్యాచ్ బంగ్లాతో 20న ఆడనుంది.