News January 1, 2025
వాట్సాప్ వేదికగా ఎక్కువగా సైబర్ నేరాలు: రిపోర్ట్

దేశంలో ఎక్కువగా సైబర్ నేరాలు వాట్సాప్ వేదికగా జరిగినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది. గత ఏడాది తొలి మూడు నెలల్లో వాట్సాప్‌పై 43,797 ఫిర్యాదులు రాగా ఆ తర్వాత టెలిగ్రామ్(22,680), ఇన్‌స్టాగ్రామ్(19,800)పై వచ్చాయని వెల్లడించింది. గూగుల్ సర్వీస్ ప్లాట్‌ఫామ్‌లను ఈ మోసాలకు ఉపయోగించారని తెలిపింది. నిరుద్యోగులు, గృహిణులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నారంది.
Similar News
News November 12, 2025
జమ్మూకశ్మీర్‌లో 500 ప్రాంతాల్లో పోలీసుల దాడులు

ఢిల్లీ పేలుడు నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఏకంగా 500 లొకేషన్లలో రెయిడ్స్ చేపట్టారు. జమాతే ఇస్లామీ(JeI), ఇతర నిషేధిత సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు, టెర్రరిస్టు సహాయకులకు చెందిన ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. JeI అనుబంధ టెర్రరిస్టులు తమ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం వచ్చిందని అధికారులు తెలిపారు.
News November 12, 2025
ఉగ్రవాదులను చట్టం ముందు నిలబెడతాం: కేంద్రం

ఢిల్లీ పేలుడు మృతులకు కేంద్ర క్యాబినెట్ సంతాపం తెలిపింది. ఇది ఉగ్రవాద చర్య అని అధికారికంగా ప్రకటించింది. ఉగ్రవాదులను చట్టం ముందు నిలబెడతామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ‘దర్యాప్తును అత్యవసరంగా నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఉగ్రవాదులు, వారి స్పాన్సర్లను గుర్తించి, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించింది’ అని తెలిపారు. పరిస్థితిని అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
News November 12, 2025
CMగా తేజస్వీ వైపే ప్రజల మొగ్గు: Axis My India

బిహార్‌లో ఎన్డీయే గెలుస్తుందని Axis My India <<18269672>>ఎగ్జిట్ పోల్<<>> సర్వే అంచనా వేసింది. అయితే CMగా ఎవరైతే బెటర్ అనే విషయంలో షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ కంటే ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వైపే ఎక్కువ మంది మొగ్గుచూపినట్లు తెలిపింది. తేజస్వీకి 34%, నితీశ్‌కు 22% మంది మద్దతు తెలిపినట్లు వెల్లడించింది. బీజేపీ అభ్యర్థికి 14%, చిరాగ్ పాస్వాన్‌కు 5% మంది సపోర్ట్ చేయడం గమనార్హం.


