News January 1, 2025
2025: ఈ హీరోల ఫ్యాన్స్‌కు ఎదురుచూపులే!
కొత్త ఏడాదిలో స్టార్ హీరోల ఫ్యాన్స్‌కు ఎదురు చూపులే మిగలనున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ చిత్రాలు ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది. ఇంకా సూపర్ స్టార్ మహేశ్-రాజమౌళి షూట్ ప్రారంభం కావాల్సి ఉంది. ‘పుష్ప-2’ సూపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ తదుపరి సినిమాపై ఎలాంటి ప్రకటన లేదు. మరోవైపు ఎన్టీఆర్ వార్-2తో వచ్చినా ఆ మూవీ బాలీవుడ్‌కే ఎక్కువగా పరిమితమయ్యే అవకాశముంది.
Similar News
News January 6, 2025
ఘోరం.. చంపి, గుండెను బయటకు తీశారు!
ఛత్తీస్‌గఢ్‌లో జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్‌ను అత్యంత ఘోరంగా చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. అతడిని చంపి గుండెను బయటకు తీశారని, కాలేయం 4 ముక్కలైందని గుర్తించారు. పక్కటెముకలు 5 చోట్ల, తలపై 15 చోట్ల ఎముకలు విరిగిపోయాయి. రూ.120 కోట్ల విలువైన రోడ్డు కాంట్రాక్టులో అవినీతి జరిగిందని ముకేశ్ కథనాలు ప్రసారం చేశారు. ఆ కొన్నిరోజులకే కాంట్రాక్టర్ ఇంటి సెప్టిక్ ట్యాంకులో ముకేశ్ డెడ్ బాడీ లభ్యమైంది.
News January 6, 2025
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హైదరాబాద్‌లోని ఆ ఆఫీసుకు చేరుకున్నారు. కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, సెజ్ వాటాలను తన నుంచి బలవంతంగా లాగేసుకున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో గతంలో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. కాకినాడ సెజ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కోణంపై ప్రధానంగా ఆయన్ను ప్రశ్నించనున్నట్లు సమాచారం.
News January 6, 2025
చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభం
TG: చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను PM మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా ₹413cr వ్యయంతో ఎయిర్ పోర్టు తరహాలో ఆధునిక మౌలిక సదుపాయాలతో ఈ టర్మినల్ నిర్మించారు. 50 రైళ్లు నడిచేలా 19 ట్రాక్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, బుకింగ్ కౌంటర్లు, వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. సికింద్రాబాద్‌కు బదులుగా ఇకపై చాలా రైళ్లు ఇక్కడే హాల్టింగ్ తీసుకుంటాయి.