News January 1, 2025
ఒక్క పంటకే రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం: హరీశ్ రావు
TG: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేవంత్‌కు మతిమరుపు వచ్చినట్లుందని హరీశ్ రావు విమర్శలు చేశారు. షరతులు పెట్టి చాలా మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టారని విమర్శించారు. రైతు భరోసా విషయంలో పది ఎకరాలకే ఇస్తాం, ఒక్క పంటకే ఇస్తామని ప్రభుత్వం లీకులు చేస్తోందని ఆరోపించారు. కోతలు పెట్టేందుకు ప్రభుత్వం కుస్తీ పడుతోందని అన్నారు. రైతులకు అన్యాయం చేస్తే రైతు లోకం తిరగబడుతుందని హరీశ్ హెచ్చరించారు.
Similar News
News January 6, 2025
అలాగైతే.. మళ్లీ టెలికం ఛార్జీలు పెంచక తప్పదు!
డేటా ప్రొటెక్షన్ డ్రాఫ్ట్ రూల్స్‌పై టెలికం కంపెనీలు, న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్సనల్ డేటాను భారత్ బయటకు బదిలీ చేయడంపై రూపొందించిన రూల్స్ ఇంటర్నేషనల్ కాల్స్, మెసేజెస్, విదేశీ నంబర్లకు వాట్సాప్ మెసేజులు పంపడంపై ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. వీటిని అమలు చేయడం కష్టమని, చాలా ఖర్చవుతుందని పేర్కొంటున్నారు. టెలికం ఛార్జీల రూపంలో ఈ భారమంతా కస్టమర్లపై వేయాల్సి వస్తుందని చెప్తున్నారు.
News January 6, 2025
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద మొబైల్స్‌తో యువకులు
ట్రాఫిక్ ఉల్లంఘనలు జరగకుండా సిగ్నల్స్ వద్ద పోలీసులు ఉండటం చూస్తుంటాం. కానీ, వియత్నాంలో సిగ్నల్స్ వద్ద యువకులు మొబైల్స్ పట్టుకొని అలర్ట్‌గా ఉండటాన్ని చూశారా? అక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించనివారి ఫొటోలను క్లిక్ చేసి పోలీసులకు పంపించడాన్ని కొందరు ఆదాయంగా మలుచుకున్నారు. ఇలా చేస్తే విధించిన జరిమానాలో 10శాతాన్ని బౌంటీగా వారికి పోలీసులు అందిస్తారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.
News January 6, 2025
ఆ విషయం PMతో లోకేశ్ చెప్పించగలరా?: అమర్నాథ్
AP: ఏ శాఖ మీదా అవగాహన లేకుండా సకల శాఖల మంత్రిగా లోకేశ్ తయారయ్యారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. PM మోదీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ YCP హయాంలో వచ్చినవే అని చెప్పారు. 15 ఏళ్లు సీఎంగా ఉండి ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని, అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని PMతో లోకేశ్ చెప్పించగలరా? అని అమర్నాథ్ ప్రశ్నించారు.