News January 1, 2025
దిల్ రాజు కాదు డీల్ రాజు: బీఆర్ఎస్ నేతలు
TG: రాజకీయాల కోసం సినిమాలు వాడుకోవద్దన్న సినీ నిర్మాత, FDC ఛైర్మన్ <<15030891>>దిల్ రాజు వ్యాఖ్యలపై<<>> బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. దిల్ రాజు కాంగ్రెస్ తొత్తుగా మారారని దుయ్యబట్టారు. మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆయన దిల్ రాజు కాదు డీల్ రాజు అని క్రిశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్ సెటైర్లు వేశారు.
Similar News
News January 6, 2025
బిచ్చగాళ్లను పట్టిస్తే రూ.వెయ్యి నజరానా
ఇండోర్ నగరాన్ని బిచ్చగాళ్లు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు మధ్యప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో యాచకులను పట్టిస్తే రూ.వెయ్యి బహుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లా యంత్రాంగానికి వందల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయి. యాచకుల సమాచారం అందించినవారికి కలెక్టర్ ఆశీష్ సింగ్ రూ.వెయ్యి నజరానా అందించారు. మరోవైపు సర్కార్ కూడా స్వచ్ఛందంగా యాచకులను రీహాబిలిటేషన్ సెంటర్‌కు తరలిస్తోంది.
News January 6, 2025
జవాన్ల త్యాగం వృథాగా పోదు: అమిత్ షా
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో మందుపాతర పేలి <<15079768>>జవాన్లు మరణించిన<<>> ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. జవాన్ల త్యాగం వృథాగా పోదని, వారి లోటును మాటల్లో వర్ణించలేమన్నారు. 2026 మార్చికల్లా నక్సలిజాన్ని అంతం చేస్తామని ఉద్ఘాటించారు. జవాన్లపై దాడిని పిరికిపంద చర్యగా CG సీఎం విష్ణుదేవ్ వర్ణించారు.
News January 6, 2025
కేవీ రావుకు నేను ఫోన్ చేయలేదు.. కాల్ డేటా చూసుకోవచ్చు: VSR
కాకినాడ సీ పోర్ట్ షేర్ల వ్యవహారంలో తనకు సంబంధం లేదని YCP MP విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. HYDలో ఈడీ విచారణ అనంతరం ఆయన మాట్లాడారు. ‘KV రావుతో నాకు సంబంధం లేదు. 2020 మేలో నేను ఫోన్ చేశానని ఆయన చెబుతున్నారు. కాల్ డేటాతో చెక్ చేసుకోవచ్చు. సీపోర్ట్ విషయంలో నేనెవరికీ ఫోన్ చేయలేదు. నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం. కేవీ రావు తిరుపతికి వచ్చి దేవుడు ముందు నిజాలు చెప్పాలి’ అని పేర్కొన్నారు.