News January 1, 2025
GOOD NEWS: ఎయిరిండియా విమానాల్లో వైఫై
విమాన ప్రయాణికులకు ఎయిరిండియా శుభవార్త చెప్పింది. తాము ఆపరేట్ చేసే డొమెస్టిక్ ఫ్లైట్లలో నేటి నుంచి వైఫై సర్వీసులను ప్రారంభించామని వెల్లడించింది. దీంతో డొమెస్టిక్ ఫ్లైట్లలో వైఫై కనెక్టివిటీ తెచ్చిన తొలి ఎయిర్‌లైన్ కంపెనీగా నిలిచింది. ఎయిరిండియా A350, B787-9, A321neo ఎయిర్‌క్రాఫ్టుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో 10వేల అడుగుల ఎత్తులో కూడా కాల్స్, మెసేజెస్ చేసుకోవచ్చు.
Similar News
News January 6, 2025
ఆఫీసుల్లో మాస్కులు షురూ!
HMPV భారత్‌లో ప్రవేశించడంతో మళ్లీ కరోనా నాటి పరిస్థితులు దాపురించేలా ఉన్నాయి. కార్పొరేట్ కార్యాలయాలతో పాటు రద్దీ ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులు మాస్కులు ధరించేలా యాజమాన్యాలు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాయి. జనాల తాకిడి ఉన్న ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇకపై మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. బెంగళూరులో ఇవాళ ఒక్క రోజే 2 HMPV పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
News January 6, 2025
ఘోరం.. చంపి, గుండెను బయటకు తీశారు!
ఛత్తీస్‌గఢ్‌లో జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్‌ను అత్యంత ఘోరంగా చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. అతడిని చంపి గుండెను బయటకు తీశారని, కాలేయం 4 ముక్కలైందని గుర్తించారు. పక్కటెముకలు 5 చోట్ల, తలపై 15 చోట్ల ఎముకలు విరిగిపోయాయి. రూ.120 కోట్ల విలువైన రోడ్డు కాంట్రాక్టులో అవినీతి జరిగిందని ముకేశ్ కథనాలు ప్రసారం చేశారు. ఆ కొన్నిరోజులకే కాంట్రాక్టర్ ఇంటి సెప్టిక్ ట్యాంకులో ముకేశ్ డెడ్ బాడీ లభ్యమైంది.
News January 6, 2025
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హైదరాబాద్‌లోని ఆ ఆఫీసుకు చేరుకున్నారు. కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, సెజ్ వాటాలను తన నుంచి బలవంతంగా లాగేసుకున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో గతంలో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. కాకినాడ సెజ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కోణంపై ప్రధానంగా ఆయన్ను ప్రశ్నించనున్నట్లు సమాచారం.