News January 1, 2025
100కు పైగా కోర్సులు.. దరఖాస్తులు ఆహ్వానం
TG: నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో AI డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ సహా 100కు పైగా కోర్సుల్లో శిక్షణకు రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, PG, బీటెక్ చేసిన వారు ఈ నెల 9లోపు అప్లై చేసుకోవాలి. కోర్సులు పూర్తిచేసుకున్న వారికి దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రోగ్రామ్ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీమాన్ తెలిపారు.
వెబ్‌సైట్: <
Similar News
News January 6, 2025
‘ది రాజాసాబ్’ విడుదల వాయిదా పడినట్లేనా?
ప్రభాస్ నటిస్తోన్న ‘ది రాజాసాబ్’ సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. APR 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించగా అదే తేదీన అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. దీంతోపాటు తెలుగులో చిరంజీవి ‘విశ్వంభర’, సిద్ధూ జొన్నలగడ్డ ‘జాక్’లు ఏప్రిల్ 10న వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ‘ది రాజాసాబ్’ విడుదల తేదీని మారుస్తారని పేర్కొన్నాయి.
News January 6, 2025
నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
AP: ఇవాళ్టి నుంచి ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) సేవలు నిలిపివేస్తున్నట్లు ఆస్పత్రుల అసోసియేషన్ ప్రకటించింది. ఇప్పటినుంచే EHS, OP సేవలను బంద్ చేస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వంతో చర్చలు సఫలం కాకపోతే ఈ నెల 26 నుంచి అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని హెచ్చరించింది. రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రేపు స్పెషల్ సీఎస్‌తో అసోసియేషన్ భేటీ కానుంది.
News January 6, 2025
బిచ్చగాళ్లను పట్టిస్తే రూ.వెయ్యి నజరానా
ఇండోర్ నగరాన్ని బిచ్చగాళ్లు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు మధ్యప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో యాచకులను పట్టిస్తే రూ.వెయ్యి బహుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లా యంత్రాంగానికి వందల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయి. యాచకుల సమాచారం అందించినవారికి కలెక్టర్ ఆశీష్ సింగ్ రూ.వెయ్యి నజరానా అందించారు. మరోవైపు సర్కార్ కూడా స్వచ్ఛందంగా యాచకులను రీహాబిలిటేషన్ సెంటర్‌కు తరలిస్తోంది.