News January 1, 2025
ఈ జనవరి వెచ్చ వెచ్చగా.. IMD వేడి కబురు
జనవరిలో చలి నామమాత్రమేనని IMD తెలిపింది. తూర్పు, నైరుతి, పశ్చిమ మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాలు మినహా అన్ని చోట్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా ఉంటాయని వెల్లడించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలూ అధికమేనని చెప్పింది. మధ్య భారతంలోని WEST, NORTH ప్రాంతాల్లో మాత్రం చలిగాలులు వీస్తాయని పేర్కొంది. వర్షపాతం 86% కన్నా తక్కువే ఉంటుందని తెలిపింది. PJB, HAR, HP, JK, UK, UPలో రబీ పంటలకు ఇదే ఆధారం.
Similar News
News January 6, 2025
నటికి వేధింపులు.. 30 మందిపై కేసు
సోషల్ మీడియాలో కొందరు తనను <<15073430>>వేధింపులకు గురిచేస్తున్నారని<<>> హీరోయిన్ హనీ రోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 30 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు ఓ బిజినెస్‌మన్ తనను వేధిస్తున్నారని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పలువురు అభ్యంతరకర కామెంట్లు చేయడంతో ఆమె ఎర్నాకులం పోలీసులను ఆశ్రయించారు. వారి కామెంట్లు మానసిక వేధింపులకు కారణమయ్యాయని ఆమె పేర్కొన్నారు.
News January 6, 2025
HMPV.. కరోనా వైరస్‌లా ప్రమాదకరమా?
HMPV వైరస్ కొత్తదేమీ కాదని, ఎన్నో ఏళ్లుగా చాలా దేశాల్లో ఉందని HYD అపోలో ఆస్పత్రి వైద్యుడు సుధీర్ కుమార్ తెలిపారు. ఇది కరోనా లాంటిది కాదని, మహమ్మారి అయ్యే అవకాశాలు లేవంటున్నారు. సాధారణంగా 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిలో, వృద్ధుల్లో, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో HMPV సంక్రమిస్తుందని పేర్కొన్నారు. ఈ వైరస్ సోకిన 4-7 రోజుల్లో కోలుకుంటారని వివరించారు.
News January 6, 2025
పుష్పకేమో నీతులు.. గేమ్ ఛేంజర్‌కు పాటించరా!: అంబటి
AP: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లొస్తూ మరణించిన అభిమానులకు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పరిహారం ప్రకటించడంపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పరోక్షంగా విమర్శలు చేశారు. ‘పుష్పకేమో నీతులు చెప్తారా.. ‘గేమ్ ఛేంజర్’కి పాటించరా!’ అని పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.