News January 1, 2025

టెస్టు ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన నితీశ్

image

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో అదరగొడుతున్న తెలుగు తేజం నితీశ్ కుమార్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు. తన కెరీర్‌లో అత్యుత్తమ రేటింగ్ 528 పాయింట్లకు చేరుకోగా 20 స్థానాలు ఎగబాకి 53వ ర్యాంకులో నిలిచారు. మరోవైపు ఓపెనర్ జైస్వాల్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక ఈ సిరీస్‌లో విఫలమవుతోన్న విరాట్ 24, రోహిత్ 40వ స్థానానికి పడిపోయారు.

Similar News

News January 6, 2025

అందరూ పరిశుభ్రత పాటించాలి: ICMR

image

hMPV వైరస్‌పై ఎవరూ ఆందోళన చెందవద్దని ICMR తెలిపింది. సాధారణ వైరస్‌ల మాదిరిగానే దీని ప్రభావం ఉంటుందని పేర్కొంది. జలుబు, ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపింది. చిన్నారులు, వృద్ధుల్లో ఈ వైరస్ ఎక్కువగా కనిపిస్తుందని పేర్కొంది. సీజనల్ శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొనేందుకు దేశంలోని అన్ని ఆస్పత్రులు సంసిద్ధంగా ఉన్నాయని తెలిపింది. అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని విజ్ఞప్తి చేసింది.

News January 6, 2025

ప్రతి ఆస్పత్రిలో 20 ఐసోలేషన్ బెడ్స్: మంత్రి సత్యకుమార్

image

AP: దేశంలో hMPV కేసులు నమోదవుతుండటంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రతి ఆస్పత్రిలో 20 ఐసోలేషన్ బెడ్స్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ICMR అడ్వైజరీ మాత్రమే ఇచ్చిందని, ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

News January 6, 2025

4 ప్రధాన నగరాల్లో hMPV కేసులు

image

hMPV కేసులు మ‌న దేశంలో కూడా వెలుగుచూస్తుండ‌డంతో ప్ర‌భుత్వాలు అప్రమత్తమయ్యాయి. బెంగ‌ళూరు, అహ్మ‌దాబాద్‌, కోల్‌క‌త్తా, చెన్నైలో కేసులు నమోదయ్యాయి. ఫారిన్ ట్రావెల్ హిస్ట‌రీ లేక‌పోయినా పాజిటివ్ నిర్ధార‌ణ అవుతుండ‌డంతో ల‌క్షణాలు ఉన్న వారు బ‌హిరంగ ప్ర‌దేశాల్లో తిర‌గ‌వ‌ద్ద‌ని వైద్యాధికారులు సూచిస్తున్నారు. జ‌న‌సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధ‌రించాల‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఆదేశించింది.