News March 16, 2024
తెలుగులోకి బ్లాక్‌బస్టర్ మూవీ
మాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు(రూ.190+ కోట్లు) సాధించిన మూవీగా చరిత్ర సృష్టించిన ‘మంజుమెల్ బాయ్స్’ తెలుగులోకి రానుంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని, ఈ నెల 29న రిలీజ్ చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్ కసరత్తు చేస్తోందని టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. లోతైన గుహలో జారిపడిన యువకుడిని స్నేహితులు ఎలా కాపాడారన్న అంశంతో వాస్తవ ఘటన ఆధారంగా మూవీ తెరకెక్కింది.
Similar News
News December 21, 2024
లెజెండరీ క్రికెటర్లకు దక్కని ఫేర్వెల్
టీమ్ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన లెజెండరీ క్రికెటర్లకు ఫేర్వెల్ లభించకపోవడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో దీనిపై చర్చ జరుగుతోంది. భారత క్రికెట్‌కు అత్యుత్తమ సేవలందించిన యువరాజ్, ద్రవిడ్, సెహ్వాగ్, VVS లక్ష్మణ్, జహీర్ ఖాన్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, ధోనీ, సురేశ్ రైనా, ధవన్, అశ్విన్‌లకు గుర్తుండిపోయే ఫేర్వెల్ ఇవ్వాల్సిందంటున్నారు.
News December 21, 2024
సీఎం సోదరుడి వల్ల వ్యక్తి చనిపోతే ఎందుకు చర్యల్లేవు?: హరీశ్
TG: అబద్ధాల్లో CM రేవంత్ రెడ్డి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కుతారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ఆయన చెప్పినవన్నీ అసత్యాలేనని మండిపడ్డారు. రుణమాఫీ, రైతు భరోసా, బోనస్‌పై క్లారిటీ ఇవ్వలేదన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధాకరమని హరీశ్ అన్నారు. కానీ సీఎం సోదరుడి వల్ల ఓ వ్యక్తి చనిపోతే చర్యల్లేవని, వాంకిడి హాస్టల్లో విషాహారం తిని బాలిక చనిపోతే మంత్రులెవరూ ఎందుకు పరామర్శించలేదని ఆయన ప్రశ్నించారు.
News December 21, 2024
శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది: కిమ్స్
TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యంపై కిమ్స్ ఆస్పత్రి బులిటెన్ విడుదల చేసింది. బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, వెంటిలేటర్ సాయం లేకుండా శ్వాస తీసుకుంటున్నట్లు వివరించింది. అప్పుడప్పుడూ జ్వరం వస్తోందని పేర్కొంది. నిన్నటితో పోల్చితే ఇవాళ ఆరోగ్యం మెరుగుపడినట్లు వైద్యులు బులిటెన్‌లో వెల్లడించారు. అటు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి ఆస్పత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించారు.