News March 16, 2024

వన్ ఎలక్షన్- వన్ ఫేజ్ ప్రయత్నించగలమా?: కమల్ హాసన్

image

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్ హాసన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్‌ను అమలు చేయడానికి ముందు మనం వన్ ఎలక్షన్- వన్ ఫేజ్ ప్రయత్నించగలమా?’ అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 7 దశల్లో నిర్వహించనున్నట్లు EC వెల్లడించిన విషయం తెలిసిందే. మరోవైపు జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కేంద్రం ఏర్పాటుచేసిన కమిటీ ఇటీవల ఓ నివేదికను సమర్పించింది.

Similar News

News January 10, 2025

భారత క్రికెటర్ నితీశ్ రెడ్డికి ACA సన్మానం

image

టీమ్ ఇండియా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిని ACA (ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్) ఘనంగా సన్మానించింది. బీజీటీ సిరీస్‌లో గొప్పగా ఆడినందుకు ఆయనను అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. త్వరలో ఏసీఏ ఆయనకు ప్రకటించిన రూ.25 లక్షల చెక్కును అందించనుంది. కాగా బీజీటీలో నితీశ్ 298 పరుగులతో టోర్నీలో నాలుగో టాప్ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. బాక్సింగ్ డే టెస్టులో సెంచరీతోనూ చెలరేగారు.

News January 10, 2025

ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

image

ఏపీలో జగనన్న కాలనీల పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఎంఏవై-ఎన్టీఆర్ నగర్‌గా పేరు మారుస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధులతో ప్రజలకు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణాలు చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది.

News January 10, 2025

26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తా: రేవంత్

image

TG: అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రభుత్వం 2 కళ్లలా భావిస్తోందని CM రేవంత్ వెల్లడించారు. కలెక్టర్లు ఇంకా పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. IAS, IPS అధికారులు నెలలో ఒక్కసారైనా హాస్టల్స్ విజిట్ చేసి రాత్రి బస చేయాలన్నారు. మహిళా అధికారులు బాలికల హాస్టల్స్‌కు వెళ్లి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపాలన్నారు. JAN 26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తానని, నిర్లక్ష్యం కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.