News January 2, 2025
సీఎం అధికారిక నివాసంగా ఉండవల్లి గృహం
AP: గుంటూరు జిల్లా ఉండవల్లిలోని గృహాన్ని సీఎం చంద్రబాబు అధికారిక నివాసంగా గుర్తిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2024 జూన్ 12 నుంచి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. 2017 నుంచి 2019 వరకు కూడా సీఎం హోదాలో చంద్రబాబు అక్కడే నివాసం ఉన్నారు. అయితే కృష్ణా నది ఒడ్డున ఉన్న ఆ నిర్మాణం అక్రమమని వైసీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News January 6, 2025
Stock Market: బేర్స్ వెంటాడారు..
స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. ఇంట్రాడేలో రూపాయి విలువ జీవితకాల కనిష్ఠం 85.84 స్థాయికి పతనమవ్వడం, దేశంలో HMPV కేసులు వెలుగుచూడడం, ఈక్విటీ ఔట్‌ఫ్లో నష్టాలకు కారణమయ్యాయి. Sensex 1,258 పాయింట్లు కోల్పోయి 77,964 వద్ద, Nifty 23,616 (-388) వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, రియల్టీ రంగాల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇన్వెస్టర్ల రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
News January 6, 2025
మాటల యుద్ధం: కుమార స్వామి X సిద్ద రామయ్య
కర్ణాటక ప్రభుత్వం ప్రతి కాంట్రాక్టులో 60% కమీషన్ తీసుకుంటోందని కేంద్ర మంత్రి కుమార స్వామి ఆరోపించారు. తుమకూరులో కాంగ్రెస్ నేత స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడం దానికి నిదర్శనమని పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను సీఎం సిద్ద రామయ్య కొట్టిపారేశారు. ఈ విషయమై కుమార స్వామి ఆరోపణలు చేయడం కాకుండా, ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. విపక్షాలు ఉన్నది కేవలం ఆరోపణలు చేయడానికి కాదన్నారు.
News January 6, 2025
ఐర్లాండ్‌తో సిరీస్‌కు భారత జట్టు ప్రకటన
ఐర్లాండ్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌కు బీసీసీఐ భారత మహిళల జట్టును ప్రకటించింది. ఈ టూర్‌కు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తోపాటు సీనియర్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్‌కు విశ్రాంతినిచ్చింది. 15 మందితో కూడిన జట్టుకు స్మృతి మంధాన నాయకత్వం వహిస్తారు. జట్టు: మంధాన (C), దీప్తి శర్మ, ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, ఉమా, రిచా, తేజల్, రాఘవి, మిన్ను మణి, తనూజ, ప్రియా, సాధు, సైమా, సయాలి.