News March 16, 2024

ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా తండ్రి, కొడుకు

image

మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలోని తణుకు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆయన తనయుడు కారుమూరి సునీల్ కుమార్ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీలో ఉన్నారు. తండ్రి కొడుకులు ఒకే పార్టీలో ఎమ్మెల్యేగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ పోటీలో ఉండడం ఆసక్తికరంగా మారింది.

Similar News

News April 9, 2025

ప.గో జిల్లా వాసులకు గ్యాస్ భారం

image

గ్యాస్ ధరల పెంపు ప.గో జిల్లా సామాన్యుడి తలపై గుది బండలా మారింది. గృహ అవసరాలకు వాడే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఏకంగా రూ. 50 పెరగడంతో రూ. 860కి చేరింది. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. ముందుగా వినియోగదారుని సొమ్ముతో సిలిండర్ బుక్ చేసుకుంటున్నారు. పలు కారణాలతో ఆ నగదు వినియోగదారుని ఖాతాకు జమ కావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ కామెంట్.

News April 9, 2025

జిల్లాలో 2,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: జేసీ

image

జిల్లాలో ఇప్పటివరకు 43 రైతు సేవా కేంద్రాలు ద్వారా 2,500 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం భీమవరం కలెక్టర్ ఛాంబర్‌లో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, సహకార, వ్యవసాయ, రవాణా, అసిస్టెంట్ కంట్రోల్ లీగల్ మెట్రాలజీ, అగ్రికల్చర్ ట్రెండ్ మార్కెటింగ్ శాఖల అధికారులతో సమీక్షించారు. సమస్యలు ఏమైనా ఉంటే జిల్లా కంట్రోల్ రూమ్ 8121676653 తెలియజేయాలన్నారు.

News April 8, 2025

ప.గో: రొయ్యకు రెస్ట్.. రైతుల నిర్ణయం

image

రొయ్యల సాగుకు మద్దతు ధరలు లేకపోవడంపై పచ్చిమ గోదావరి జిల్లా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జులై నుంచి 3 నెలల పాటు రొయ్య సాగుకు విరామం ప్రకటిస్తున్నట్లు ఉమ్మడి ప.గో జిల్లాలోని పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాలకు చెందిన రైతులు ప్రకటించారు. మేత నుంచి రొయ్యల మద్దతు ధరల వరకు తమకు అన్యాయం జరుగుతోందని, ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి ప్రభుత్వం వరకు తమకు అండగా నిలవాలని ఆక్వా రైతులు డిమాండ్ చేశారు.

error: Content is protected !!