News March 16, 2024
అరకు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా చెట్టి తనూజారాణి

అరకు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా చెట్టి తనూజారాణికి టిక్కెట్ కేటాయిస్తూ అధిష్ఠానం సస్పెన్స్‌కు తెరదించింది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన గుమ్మా తనూజారాణికి అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ కుమారుడు వినయ్ తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. తనూజారాణి తండ్రి శ్యాం సుందర్ హుకుంపేట మండలం అడ్డుమండ సర్పంచ్‌గా చేస్తున్నారు.
Similar News
News September 3, 2025
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

CM చంద్రబాబు ఈనెల 5న విశాఖ రానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ హరేంధిర ప్రసాద్, CP శంఖబ్రత బాగ్చీ పరిశీలించారు. బీచ్ రోడ్డులోని ఓ రిసార్ట్‌లో నేషనల్ మీడియేషన్‌కు CM హాజరవుతారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా రుషికొండ చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నరసింహ, జస్టిస్ సూర్యకాంత, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పాల్గొంటారు.
News September 3, 2025
విశాఖ నుంచి రోడ్డు మార్గంలో మాడగడకు పవన్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 5వ తేదీన అల్లూరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8:45కు విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్న పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో ద్వారా అరకు వ్యాలీ మండలం మాడగడ గ్రామంలో పర్యటించనున్నారు. గ్రామంలో నిర్వహించనున్న బలిపోరోబ్ ముగింపు ఉత్సవంలో పాల్గొనున్నారు. 3:30కి మాడగడ నుంచి తిరిగి పయణమై సాయంత్రం 5:30కి తిరిగి విశాఖ చేరుకుంటారు.
News September 3, 2025
స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు అందని జీతాలు..!

స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మూడో తేదీ వచ్చినా జీతాలు పడకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఏడాదిగా ప్రతినెల జీతంలో 75% మాత్రమే చెల్లిస్తున్నట్లు ఉద్యోగులు వెల్లడించారు. ఇప్పటివరకు దాదాపు మూడు రెట్ల జీతం యాజమాన్యం బకాయి పడిందన్నారు. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.