News January 2, 2025

న్యూ ఓర్లాన్స్ ట్రక్కు దాడి ఉగ్రచర్యే: ఎఫ్‌బీఐ

image

నూతన సంవత్సర వేడుకల సమయంలో అమెరికాలోని న్యూ ఓర్లాన్స్‌లో జరిగిన ట్రక్కు దాడిని ఉగ్రచర్యగా భావిస్తున్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ప్రకటించింది. తొలుత ట్రక్కుతో జనాన్ని ఢీ కొట్టిన నిందితుడు ఆ తర్వాత తుపాకీతో కాల్పులు ప్రారంభించాడు. ఈ దారుణ ఘటనలో 10మంది మృతిచెందగా 35మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు.

Similar News

News January 6, 2025

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఎదుట విదేశీ వైద్య విద్యార్థుల ఆందోళన

image

AP: విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎదుట ఆందోళనకు దిగారు. ఇంటర్న్‌షిప్ గడువు మూడేళ్లు కాకుండా ఏడాది మాత్రమే పెట్టాలని డిమాండ్ చేశారు. మూడేళ్ల ఇంటర్న్‌షిప్ చేయాలని సర్క్యూలర్ జారీచేయడాన్ని వ్యతిరేకించారు. వర్సిటీ తమపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. వెంటనే అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు.

News January 6, 2025

పవన్.. నీకు మానవత్వం ఉందా?: రోజా

image

AP: గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరి అభిమానులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంకా పరామర్శించకపోవడం అమానవీయమని వైసీపీ నేత రోజా విమర్శించారు. ‘ రేవతి వ్యవహారంలో ‘పుష్ప 2’ టీమ్ బాధ్యతగా వ్యవహరించలేదని పవన్ అన్నారు. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్నదేమిటీ? పైగా వారి మరణానికి వైసీపీ రోడ్లు వేయకపోవడమే కారణమని పవన్ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు’ అని ఆమె ఫైర్ అయ్యారు.

News January 6, 2025

క్రికెట్ లీగ్‌లో అడుగుపెట్టిన అభిషేక్ బచ్చన్

image

బాలీవుడ్ నటుడు ETPL(యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌)లో అడుగుపెట్టారు. ఇటీవలే ఐసీసీ ఆమోదం పొందిన ETPL ఈ ఏడాది జులైలో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్‌ ప్లేయర్లతో పాటు ప్రపంచస్థాయి క్రికెటర్లు కూడా ఆడతారు. ఈ లీగ్‌లో అభిషేక్ ఓ జట్టుకు కో ఓనర్‌గా వ్యవహరించనున్నారు. కాగా అభిషేక్ ఇప్పటికే PKLలో జైపూర్ పింక్ ఫ్యాంథర్స్ జట్టుకు ఓనర్‌గా ఉన్న విషయం తెలిసిందే.