News January 2, 2025
అమరావతి నిర్మాణం పూర్తైతే సినిమాలన్నీ ఏపీలోనే: సీఎం చంద్రబాబు
AP: తెలుగు చిత్ర పరిశ్రమ త్వరలోనే రాష్ట్రానికి వస్తుందని CM చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ‘సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ పెరిగింది. అమరావతి నిర్మాణం పూర్తైతే ఇక సినిమాలన్నీ APలోనే. ఇక్కడ సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుంది’ అని పేర్కొన్నారు. తప్పుడు పనులు చేయొద్దని ఎమ్మెల్యేలను తాను పదేపదే హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. జగన్ చేసిన పాపాలన్నింటినీ ఒక్కొక్కటిగా సరిచేస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు.
Similar News
News January 6, 2025
4 ప్రధాన నగరాల్లో hMPV కేసులు
hMPV కేసులు మన దేశంలో కూడా వెలుగుచూస్తుండడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. బెంగళూరు, అహ్మదాబాద్, కోల్కత్తా, చెన్నైలో కేసులు నమోదయ్యాయి. ఫారిన్ ట్రావెల్ హిస్టరీ లేకపోయినా పాజిటివ్ నిర్ధారణ అవుతుండడంతో లక్షణాలు ఉన్న వారు బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు. జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది.
News January 6, 2025
తొక్కిసలాట ఘటన.. సంధ్య థియేటర్ ఓనర్లకు రిలీఫ్
TG: తొక్కిసలాట ఘటన కేసులో సంధ్య థియేటర్ ఓనర్లకు భారీ ఊరట లభించింది. ఓనర్లు చిన్నరామిరెడ్డి, పెద్దరామిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు షూరిటీలు, రూ.25 వేలు పూచీకత్తుగా సమర్పించాలని పేర్కొంది. ఇదే కేసులో అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే.
News January 6, 2025
‘ది రాజాసాబ్’ విడుదల వాయిదా పడినట్లేనా?
ప్రభాస్ నటిస్తోన్న ‘ది రాజాసాబ్’ సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. APR 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించగా అదే తేదీన అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. దీంతోపాటు తెలుగులో చిరంజీవి ‘విశ్వంభర’, సిద్ధూ జొన్నలగడ్డ ‘జాక్’లు ఏప్రిల్ 10న వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ‘ది రాజాసాబ్’ విడుదల తేదీని మారుస్తారని పేర్కొన్నాయి.