News January 2, 2025
దిల్ రాజు కరెక్ట్‌గానే చెప్పారు: సీపీఐ నారాయణ
సినీ రంగాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని నిర్మాత దిల్ రాజు చేసిన ప్రకటనకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మద్దతు తెలిపారు. ఆయన అభిప్రాయం సమంజసమేనని వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వానికి, సినిమా రంగానికి విభేదాలు అవసరం లేదు. దిల్ రాజు ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నా’ అని పేర్కొన్నారు. కాగా.. చిత్ర పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దంటూ మాజీ మంత్రి KTRకు రాజు చేసిన సూచన రాజకీయ చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.
Similar News
News January 6, 2025
నమస్కారం ముద్దు.. హ్యాండ్ షేక్ వద్దు: IMA
చలితో ప్రబలే సీజనల్ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలని IMA హైదరాబాద్ విభాగం సూచించింది. ప్రస్తుతం నగరంలో శ్వాస సంబంధ కేసులు అదుపులోనే ఉన్నాయని తెలిపింది. అయినప్పటికీ పిల్లలు సహా అందరూ తప్పక ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని IMA HYD అధ్యక్షుడు డా. ప్రభు సూచించారు. hMPV కేసుల నేపథ్యంలో ఇతరులను తాకడాన్ని మానుకోవాలన్నారు. అటు పలకరింపులో ‘నమస్కారం ముద్దు హ్యాండ్ షేక్ వద్దు’ను పాటించాలని సూచించారు.
News January 6, 2025
బౌన్సర్ల తీరుపై నటుడి అసహనం
బౌన్సర్ల తీరుపై నటుడు బ్రహ్మాజీ X వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ‘ఎక్కడ చూసినా బౌన్సర్స్. వాళ్ల ఓవరాక్షన్ ముందు మా యాక్షన్ సరిపోవట్లేదు. ఏం చేయాలి? బయట అయితే ఓకే. సెట్స్‌లో కూడానా’ అని రాసుకొచ్చారు. దీంతో ‘సెట్స్‌లో మిమ్మల్ని బౌన్సర్లు ఏమైనా అన్నారా?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏ మూవీ షూటింగ్లో జరిగిందో చెప్పాలని కోరుతున్నారు.
News January 6, 2025
ట్రెండింగ్‌లో #lockdown
దేశంలో hMPV కేసులు నమోదవుతుండటంతో ట్విటర్లో lockdown హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. లాక్డౌన్ పెట్టాలని, WFH అమలు చేయాలని కొందరు నెటిజన్లు కోరుతున్నారు. ఇంకొందరు మీమ్స్ షేర్ చేస్తున్నారు. మరికొందరేమో బాధ్యతగా, మానవతా దృక్పథంతో నడుచుకోవాలని సూచిస్తున్నారు. కొవిడ్ లాక్డౌన్లో ఎంతో మంది ఉపాధి, సన్నిహితులను కోల్పోయి చిత్రవధ అనుభవించారని గుర్తు చేస్తున్నారు. ఫార్మా మాఫియాను నిందిస్తున్నారు.