News January 2, 2025
సంజయ్ రౌత్‌పై ఉద్ధవ్ అనుచరుల దాడి?
శివసేన(UBT) కీలక నేత సంజయ్ రౌత్‌పై ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ అనుచరులు దాడి చేశారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అధినేత నివాసమైన మాతోశ్రీలో స్వయంగా ఉద్ధవ్ కళ్ల ఎదుటే ఇది జరిగిందని అంటున్నారు. పార్టీ సమావేశం సందర్భంగా ఠాక్రే మద్దతుదారులకు, రౌత్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని, అది దాడి వరకూ వెళ్లిందని సమాచారం. రౌత్ వల్ల పార్టీ నష్టపోయిందన్న భావనలో ఉద్ధవ్ ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 6, 2025
రాత్రి 8లోపు డిన్నర్ చేస్తే ఇన్ని లాభాలా!
వివిధ కారణాలతో రాత్రిపూట ఆహారాన్ని తినడంలో చాలా మంది ఆలస్యం చేస్తుంటారు. అయితే, రాత్రి ఎనిమిది గంటలలోపు డిన్నర్ చేయడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ‘జీవక్రియ పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నాణ్యమైన నిద్రపడుతుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. గుండె వ్యాధులు, డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. శరీర బరువు అదుపులో ఉంటుంది’ అని తెలిపారు.
News January 6, 2025
53 టన్నుల బంగారం పోగేశారు
ప్రపంచంలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి పరిస్థితులను అధిగమించేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాల కేంద్ర బ్యాంకులు గత ఏడాది నవంబర్‌లో 53 టన్నుల బంగారాన్ని సమకూర్చుకున్నాయి. ఇందులో RBI 8 టన్నులు కొనుగోలు చేసినట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదికలో తెలిపింది. స్థానిక కరెన్సీ విలువను సుస్థిరం చేయడానికి, తద్వారా దేశ ఆర్థిక సమతుల్యతకు కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నాయి.
News January 6, 2025
దీర్ఘాయువు కోసం వీటిని పాటించండి!
సుదీర్ఘమైన ఆరోగ్యకర జీవితానికి మూడు సూత్రాలు ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. ‘రెడ్ మీట్ స్థానంలో చేప మాంసాన్ని తినండి. అప్పుడప్పుడు ఉపవాసం ఉండాలి. మీ వైద్యుడితో చర్చించి మీకు ఉత్తమమైన ఆహారం ఏంటో తెలుసుకోండి. క్రమం తప్పకుండా రోజూ ఏరోబిక్ వ్యాయామాలు, స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయండి. అనేక వ్యాధులకు ఒంటరితనం ప్రధాన కారకం. దీర్ఘాయువు కోసం స్నేహితులు, కుటుంబంతో రోజూ కొంత సమయం గడపండి’ అని తెలిపారు.