News January 2, 2025

కార్ల్‌సన్, ఇయాన్ టైటిల్ షేరింగ్ వివాదాస్పదం

image

ప్రపంచ చెస్ బ్లిట్జ్ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను పంచుకోవాలని మాగ్నస్ కార్ల్‌సన్, ఇయాన్ నెపోమ్నియాచ్‌చీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఇది చరిత్రలో తొలిసారి కావడం గమనార్హం. అయితే స్పష్టమైన విజేతను తేల్చకుండా ఇద్దర్నీ విజేతలుగా ప్రకటించడమేంటంటూ మాజీలు అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు. చెస్ ప్రపంచం కార్ల్‌సన్ చెప్పుచేతల్లో నడుస్తోందని విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News September 19, 2025

‘కల్కి-2’ నుంచి దీపిక ఔట్.. కారణాలివేనా?

image

‘కల్కి-2’ నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొణెను <<17748690>>తీసేయడంపై<<>> నెట్టింట చర్చ జరుగుతోంది. ఆమె డిమాండ్స్ వల్లే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన టీమ్ మొత్తాన్ని (25 మంది) లగ్జరీ హోటల్‌లో ఉంచాలనడంతో పాటు 25% రెమ్యునరేషన్ పెంచాలని, రోజుకు 5-7గంటలే పనిచేస్తానని డిమాండ్ చేశారట. ఆమె రెమ్యునరేషన్‌ హైక్‌కు ఓకే చెప్పినా, షూటింగ్ టైమ్ తగ్గించడానికి మాత్రం మేకర్స్ ఒప్పుకోలేదని సినీవర్గాలు పేర్కొన్నాయి.

News September 19, 2025

విమానంపై పిడుగు పడితే ఏమవుతుందంటే?

image

వర్షాల సమయంలో ఎగురుతున్న విమానాలు కొన్నిసార్లు పిడుగుపాటుకు గురవుతుంటాయి. అయితే ఎన్ని పిడుగులు పడినా ఫ్లైట్ లోపల ఉన్నవారికి ఏమీ కాదు. ఎందుకంటే ప్రస్తుతం విమానాలను ఫెరడే కేజ్ అనే లేయర్‌తో తయారు చేస్తున్నారు. ఈ ప్రత్యేక లోహం ఫ్లైట్‌లోకి విద్యుదయస్కాంత క్షేత్రాలు వెళ్లకుండా నియంత్రిస్తుంది. పిడుగు పడగానే ఇవి ఈ లోహపు నిర్మాణం గుండా ఒక వైపు నుంచి మరో వైపునకు వెళ్లిపోతాయి. దీని వల్ల ఎవరికీ ఏమీ కాదు.

News September 19, 2025

దసరా సెలవులు.. స్కూళ్లు, కాలేజీలకు హెచ్చరిక

image

TG: దసరా సెలవుల్లో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఎలాంటి తరగతులు నిర్వహించవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సెలవుల్లో రివిజన్ కోసం విద్యార్థులకు కొంత హోమ్ వర్క్ ఇవ్వాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు, జూ.కాలేజీలకు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉండనున్నాయి.