News January 2, 2025

గోదాం వ్యవహారాలేవీ నాకు తెలియదు: పేర్ని జయసుధ

image

AP: గోదాముల వ్యవహారాల గురించి తనకు అసలు తెలియదని పేర్ని నాని సతీమణి జయసుధ పోలీసులు విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ఆ వ్యవహారాలన్నీ తమ మేనేజర్ మానస తేజ చూసుకునేవారని ఆమె అన్నట్లు సమాచారం. గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయమైన కేసులో ఆమె ఏ-1గా ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణకు హాజరయ్యారు. న్యాయవాదుల సమక్షంలో సుమారు రెండున్నర గంటల పాటు ఆమెను పోలీసులు విచారించారు.

Similar News

News September 16, 2025

తెలంగాణ అప్డేట్స్

image

* ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో నూతన పాస్‌పోర్టు కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
* ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌కు రానున్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్. రేపు తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమానికి హాజరు.
* నల్గొండలో పదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో మర్రి ఊషయ్యకు 24 ఏళ్ల జైలు శిక్ష విధించిన పొక్సో కోర్టు. బాధితురాలికి రూ.10 లక్షలు చెల్లించాలని తీర్పు.

News September 16, 2025

నో మేకప్.. మేకప్ లుక్ కావాలా?

image

ప్రస్తుతకాలంలో ‘నో మేకప్- మేకప్ లుక్‌’ ట్రెండ్ అవుతోంది. దీనికోసం తేలిగ్గా ఉండే మాయిశ్చరైజర్, రేడియన్స్ ప్రైమర్, ల్యుమినైజింగ్ ఫౌండేషన్ వాడాలి. డార్క్ సర్కిల్స్ కనిపించకుండా లైట్‌గా కన్సీలర్ రాయాలి. ఐ ల్యాష్ కర్లర్, మస్కారా, ఐ లైనర్ అప్లై చెయ్యాలి. చీక్ బోన్స్‌పై బ్రాంజర్, బ్లషర్ రాయాలి. మ్యూటెడ్ లిప్ కలర్, టింటెడ్ లిప్ బామ్ పెదవులకు అద్దాలి. అంతే మీ నో మేకప్ లుక్ రెడీ.

News September 16, 2025

పాడి పశువుల కొనుగోళ్లలో జాగ్రత్తలు

image

పాడి పశువును కొనే సమయానికి అది 2వ ఈతలో ఉండాలి. ఏ సమస్యా లేకుండా ఈనిన ఆరోగ్యమైన పశువును 15 రోజుల లోపు కొనుగోలు చేయాలి. ధరను పాల ఉత్పత్తిని బట్టి నిర్ణయించాలి. పశువును కొనేముందు మొదటిసారి తీసిన పాలను లెక్కలోకి తీసుకోకూడదు. రెండో రోజు ఉదయం, సాయంత్రం తీసిన పాలను లెక్కలోకి తీసుకోవాలి. లీటరు డబ్బాలతో పాలను కొలవాల్సి వస్తే పాలపై నురగని పూర్తిగా తీసివేయాలి. అన్ని పశువులను ఒకేసారి కొనకపోవడం మంచిది.