News March 16, 2024
రోహిత్ కెప్టెన్సీ తొలగింపు మంచిదే: ఫించ్
ముంబై కెప్టెన్‌గా రోహిత్ శర్మ తొలగింపు ఆ జట్టుకు ఒక రకంగా మంచిదేనని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆరోన్ ఫించ్ అభిప్రాయపడ్డారు. కెప్టెన్సీ భారం భుజాలపై లేకపోవడంతో రోహిత్ మరింత స్వేచ్ఛగా, ప్రమాదకరంగా ఆడతారని పేర్కొన్నారు. ‘ఎక్కడికి వెళ్లినా జట్టు గురించి ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు రోహిత్‌కు లేదు. ఓపెనర్‌గా బరిలోకి దిగి భారీగా పరుగులు చేయడం ఒకటే ఇప్పుడు ఆయన చేయాల్సింది’ అని స్పష్టం చేశారు.
Similar News
News November 24, 2024
SRHకు హర్షల్ పటేల్.. రూ.8కోట్లు
పేస్ బౌలర్ హర్షల్ పటేల్‌ను SRH రూ.8కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్లో పంజాబ్ తరఫున ఆడిన ఇతను రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చారు. ఐపీఎల్ కెరీర్లో హర్షల్ పటేల్ 8.7 ఎకానమీతో 135 వికెట్లు తీశారు. ఇతని బెస్ట్ 4-25. డెత్ ఓవర్లలో ఇతను వేరియేషన్లతో బ్యాటర్లను ఇబ్బంది పెడతారు.
News November 24, 2024
అమ్ముడుపోని వార్నర్
డేవిడ్ వార్నర్ వేలంలో అమ్ముడుపోలేదు. మూడో సెట్లో ఆయన పేరు రాగా తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తిని చూపించలేదు. గత సీజన్లో ఢిల్లీ తరఫున ఆడిన వార్నర్ ఇటీవలి ప్రదర్శన అంతంతమాత్రమే. ఇక ఆస్ట్రేలియా తరఫున ఆయన అన్ని ఫార్మాట్లలోనూ రిటైర్ కావడం కూడా ఫ్రాంచైజీల అనాసక్తికి కారణం కావొచ్చని అంచనా.
News November 24, 2024
RTMలో జాక్ మెక్‌గర్క్‌కు రూ.9కోట్లు
విధ్వంసకర ఓపెనర్ బ్యాటర్ జాక్ మెక్‌గర్క్‌ను ఢిల్లీ రూ.9 కోట్లకు కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన ఇతని కోసం పంజాబ్, ఢిల్లీ పోటీ పడ్డాయి. RTM విధానంలో ఢిల్లీ మెక్‌గర్క్‌ను సొంతం చేసుకుంది. ఓపెనర్‌గా వచ్చి ఇతను భారీ హిట్లు కొట్టగలరు.