News January 2, 2025
నాకేం తెలియదు.. పోలీసుల విచారణలో జయసుధ
రేషన్ బియ్యం మాయం కేసుకు సంబంధించి పోలీసుల విచారణకు హాజరైన మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ గుట్టు విప్పలేదు. నిజం రాబట్టేందుకు పోలీసులు క్లిష్ట ప్రశ్నలు సంధించినా ఆమె నోరు విప్పలేదని తెలుస్తోంది. గోడౌన్ నిర్వహణ వ్యవహారాలన్నీ తమ మేనేజరే చూసుకునే వారని, తనకేమీ తెలియదని విచారణాధికారికి చెప్పినట్టు సమాచారం. జయసుధ నుంచి ఆశించిన సమాచారం రాకపోవడంతో ఆమెను మరోసారి విచారించే అవకాశం కనిపిస్తోంది.
Similar News
News January 7, 2025
అర్జీలను గడువులోగా పరిష్కరించాల్సిందే: కలెక్టర్
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందిన అర్జీలను నిర్దేశ గడువులోగా నాణ్యతతో పరిష్కరించాల్సిందేనని, రెవెన్యూ సదస్సుల అర్జీలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
News January 6, 2025
కృష్ణా: ఆ పరీక్షలలో ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే.!
మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో సోమవారం కానిస్టేబుల్(మహిళలు) అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు జరిగాయి. ఇందులో 543 మందికిగాను 304 మంది బయోమెట్రిక్‌కు హాజరయ్యారని జిల్లా SP కార్యాలయం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. వీరిలో 148 మంది డిస్ క్వాలిఫై అయ్యారని, ఇవాళ హాజరైనవారిలో 156 మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారని జిల్లా SP కార్యాలయం వివరాలు వెల్లడించింది.
News January 6, 2025
వైఎస్ జగన్‌ను కలిసిన విజయవాడ మేయర్
నూతన సంవత్సర సందర్భంగా విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ జగన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గాల పరిస్థితిపై వారు జగన్‌తో చర్చించినట్లు సమాచారం.