News January 2, 2025

HYD: 16 లక్షలకు పైగా ట్యాంకర్లతో నీటి సరఫరా!

image

గ్రేటర్ HYDలో జలమండలి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తోంది. ట్యాంకర్లు, డ్రైవర్లు, ఫిల్లింగ్ స్టేషన్లు, పాయింట్లు ఇచ్చినట్లు పేర్కొంది. జల మండలి పరిధిలో దాదాపు 733కి పైగా ట్యాంకర్లు, 78 ఫిల్లింగ్ స్టేషన్లు ఉండగా.. 2024 జనవరి 1 నుంచి మొత్తం 16,43,660 ట్యాంకర్ ట్రిప్పులను డెలివరీ చేశారు. ఎప్పటికప్పుడు లీకేజీలను పరిశీలిస్తున్నారు.

Similar News

News January 7, 2025

HYD: భారీగా పట్టుబడ్డ నకిలీ పన్నీరు

image

హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిసరి ఎంక్లేవ్‌లో నకిలీ పన్నీరు భారీ మొత్తంలో పట్టుబడింది. విశ్వసనీయ సమాచారంతో నకిలీ పన్నీరు తయారు కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేపట్టారు. నిందితులను పట్టుకొని అల్వాల్ పోలీసులకు అప్పగించారు. అక్కడ సుమారు 600 కిలోల పన్నీరు, కొన్ని రకాల కెమికల్స్ సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బేగం బజార్‌కు చెందిన ఓ వ్యాపారి దీన్ని నిర్వహిస్తున్నట్టు సమాచారం.

News January 7, 2025

HYD: hMPV పాత వైరస్.. జాగ్రత్త మంచిది: మంత్రి రాజనర్సింహ

image

hMPV అనేది కొత్త వైరస్ కాదని, 2001లోనే ఈ వైరస్ ఉనికిని కనుగొన్నారని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. నాటి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని, ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపిస్తుందన్నారు. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతని నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి వైరస్ వ్యాపిస్తుందన్నారు. చైనాలో ఈ సంవత్సరం hMPV కేసులు ఎక్కువయ్యాయన్నారు.

News January 6, 2025

HYD: నూతన ఇంధన విధానాన్ని ప్రకటిస్తాం: డిప్యూటీ సీఎం 

image

పెట్టుబడులు ఆకర్షించే విధంగా జనవరి 9న నూతన ఇంధన విధానాన్ని ప్రకటించనున్నట్లు డిప్యూటీ CM భట్టి విక్రమార్క వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎనర్జీ పాలసీతో పాటు రాష్ట్రంలో రిన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తికి అవసరమైన అంశాలను అధ్యయనం చేసి నూతన విధానాన్ని రూపొందించినట్లు భట్టి తెలిపారు. తెలంగాణ జెన్‌కోలో అసిస్టెంట్ ఇంజినీర్, ఇతర పోస్టులకు ఎంపికైన 315 మంది అభ్యర్థులకు భట్టి నియామక పత్రాలు అందజేశారు.