News January 2, 2025
మెదక్: వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి

ఉమ్మడి MDK జిల్లాలో న్యూఇయర్ రోజు జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. వివరాలు.. జోగిపేటలో డివైడర్‌ను ఢీకొని మహ్మద్ పాషా(25) మృతి చెందగా, హత్నూరలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న నీరుడి కృష్ణ(27) పై నుంచి లారీ వెళ్లడంతో చనిపోయాడు. కొండపాకలో స్నేహితులను కలిసి వస్తుండగా భాను చందర్(22) సూచిక బోర్డును ఢీకొని మృతిచెందగా, మెదక్‌లో మున్సిపల్ జవాన్ సంజీవ్(41) అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు.
Similar News
News January 14, 2026
మెదక్: జిల్లాను అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలపాలి: కలెక్టర్

అధికారులు అత్యుత్తమ సేవలతో జిల్లా అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ టేబుల్, వాల్ క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేశ్, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ప్రెసిడెంట్ విట్టల్, సెక్రటరీ నాగభూషణం, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, ట్రెజరర్ ఎల్లయ్య ఉన్నారు.
News January 14, 2026
టేక్మాల్: పతంగి ఎగరేస్తూ బిల్డింగ్ నుంచి పడ్డాడు!

టేక్మాల్ గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. భవనంపై పతంగి ఎగురవేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి లక్ష్మణ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మొదటి అంతస్తు నుంచి పడటంతో లక్ష్మణ్ కాలు విరిగినట్లు స్థానికులు తెలిపారు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పండుగ వేళ అప్రమత్తంగా ఉండాలని గ్రామస్థులు కోరుతున్నారు.
News January 13, 2026
మెదక్: సంరక్షణ కిట్లు అందజేయడం హర్షణీయం: కలెక్టర్

రైతులు పురుగుమందులు పిచికారి చేసే సమయంలో వారి ఆరోగ్య పరిరక్షణకు సంరక్షణ కిట్లు అందజేయడం జిల్లా వ్యవసాయ శాఖ పనితీరు హర్షణీయమని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా పూల బొకేలుకు బదులు సంరక్షణ కిట్లు అందజేయాలన్న కలెక్టర్ పిలుపుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.


