News January 2, 2025

సీఎంను కలిసిన మాజీ ఖైదీ.. ఎందుకంటే?

image

TG: కొత్త సంవత్సరం సందర్భంగా నిన్న నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన మాజీ ఖైదీ తరి నాగయ్య సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా అరెస్టైన రేవంత్‌కు చర్లపల్లి జైల్లో నాగయ్యే సపర్యలు చేశారు. పలు సందర్భాల్లో అతడి గురించి సీఎం బహిరంగంగానే ప్రస్తావించారు. ఇటీవల క్షమాభిక్షతో జైలు నుంచి విడుదలైన నాగయ్య సీఎంను కలిసి న్యూఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Similar News

News November 7, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* ఆచార్య NG రంగా 125వ జయంత్యుత్సవాలకు హాజరుకానున్న CM చంద్రబాబు
* వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. ప్రధాని పిలుపు మేరకు ఉ.9.50 గం.కు ప్రతి ఒక్కరం గేయాన్ని ఆలపిద్దాం: పవన్
* HYDలో జన్మించిన గజాలా హష్మీ వర్జీనియా గవర్నర్ కావడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం: CM చంద్రబాబు
* పోలవరం ప్రాజెక్ట్‌పై ఆ ప్రాజెక్ట్ అథారిటీ రెండ్రోజుల సమీక్ష. నేడు HYDలోని కార్యాలయంలో, రేపు ప్రాజెక్ట్ ప్రాంతం పరిశీలన

News November 7, 2025

APPLY NOW: AVNLలో ఉద్యోగాలు

image

చెన్నై ఆవడిలోని ఆర్మ్‌డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ (<>AVNL<<>>) 5 డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 22 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ(CS)ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు 300, SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. వెబ్‌సైట్: https://ddpdoo.gov.in/

News November 7, 2025

రబీలో సాగుచేసే వరి రకాలకు ఉండాల్సిన లక్షణాలు

image

రబీ(యాసంగి)లో సాగు నీటి లభ్యతను బట్టి వరిని సాగు చేయాలి. అలాగే విత్తుకొనే వరి రకాల పంట కాలం 120-130 రోజుల మధ్య ఉండాలి. ముఖ్యంగా అగ్గి తెగులు, దోమ పోటును తట్టుకొనే రకాలై ఉండాలి. వర్షాలకు పైరు పడిపోని రకాలను ఎన్నుకోవాలి. మెడవిరుపును తట్టుకోవాలి. చలిని తట్టుకొని పిలకలు బాగా చేయగలగాలి. గింజరాలడం తక్కువగా ఉండాలి. మేలైన గింజ నాణ్యత కలిగి మంచి ధర వచ్చే వరి రకాలను ఎన్నుకోవాలంటున్నారు వ్యవసాయ నిపుణులు.