News January 2, 2025

ఎల్బీనగర్: ట్రాఫిక్ ఉల్లంఘన జరిగింది ఇక్కడే!

image

HYD, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో జరిగిన ట్రాఫిక్ ఉల్లంఘనల్లో +80.53 శాతం ఓవర్ లోడు, అధిక ప్యాసింజర్లను తీసుకెళ్లడమే అని వార్షిక రిపోర్టు తెలిపింది. +58.47 శాతం మైనర్ల డ్రైవింగ్ చేసి, ట్రాఫిక్ నియమ నిబంధనలను వాహనదారులు ఉల్లంఘించినట్లుగా వెళ్లడైంది. ఓవర్ లోడింగ్ వద్దని, అత్యధిక ప్యాసింజర్లను వాహనాలు ఎక్కించుకోవద్దని తద్వారా ప్రమాదాలు జరిగా అవకాశం ఉందని పోలీసులన్నారు.

Similar News

News January 6, 2025

HYD: హైడ్రా ఆధ్వర్యంలో ప్రజావాణి

image

ప్రతి సోమవారం ఉదయం 11 గం. నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజావాణి నిర్వహణ జరుగుతుందని హైడ్రా అధికారులు పేర్కొన్నారు. బుద్ధ భవన్‌లో హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించి ఆక్రమణలపై నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

News January 6, 2025

HYD: రాచకొండ పోలీసుల ఆపరేషన్ స్మైల్- XI

image

రాచకొండ పోలీసులు ఆపరేషన్ స్మైల్- XI కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ చర్యతో బాల కార్మికతను నిర్మూలించడం, బాలలకు విద్యను హక్కుగా పరిచయం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్య హక్కు, ప్రత్యేక హక్కు కాదనే నినాదంతో, ఈ ప్రచారంలో బాలలకు విద్యను అందించేందుకు చర్యలు చేపట్టారు. పౌర సమాజం సహకారంతో బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న రాచకొండ పోలీస్ శాఖ, ప్రజలను భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తోంది.

News January 6, 2025

చర్లపల్లి టర్మినల్ సేవలకు ఇదే కీలకం..! 

image

చర్లపల్లి రైల్వే టర్మినల్ చుట్టూ చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. ఆయా ప్రాంతాల్లో పదేపదే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కిక్కిరిసిన రోడ్లతో ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అద్భుతంగా నిర్మించిన చర్లపల్లి టర్మినల్, మెరుగైన సేవలు అందించాలంటే, చుట్టూ ఉన్న రోడ్ల అభివృద్ధితో పాటు, భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.