News March 16, 2024

రెండో సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ ఇదే..

image

దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ 4 నెలలు(OCT 25, 1951 నుంచి FEB 21, 1952 వరకు) సాగింది. ఆ తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం ఈ ఏడాది జరగనున్నాయి. APR 19 నుంచి జూన్ 1 వరకు 44 రోజులు ప్రక్రియ కొనసాగనుంది. 1962 నుంచి 1989 మధ్య 4-10 రోజుల్లో ఎన్నికలు ముగిశాయి. అత్యల్పంగా 1980లో జనవరి 3 నుంచి 6 వరకు నాలుగు రోజుల్లోనే పూర్తయ్యాయి. 2004లో 21 రోజులు, 2009లో 30, 2014లో 36, 2019లో 39 రోజులు జరిగాయి.

Similar News

News October 30, 2024

ICC ర్యాంకింగ్స్‌: బుమ్రా కిందకి.. జైస్వాల్ పైకి

image

తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ బుమ్రా 3వ స్థానానికి పడిపోయారు. అశ్విన్ 4, జడేజా 8వ స్థానంలో ఉన్నారు. ఈ విభాగంలో సౌతాఫ్రికా బౌలర్ కగిసో రబాడ అగ్రస్థానానికి చేరుకున్నారు. బ్యాటింగ్‌ విభాగంలో భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 3వ స్థానానికి ఎగబాకారు. టాప్‌-10లో భారత్ నుంచి అతనొక్కడే ఉన్నారు. ఈ విభాగంలో టాప్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ రూట్ ఉన్నారు.

News October 30, 2024

రైతు సమస్యలపై జగన్ మొసలి కన్నీరు: MLA జీవీ

image

AP: రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్‌కు లేదని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. ఉచిత పంటల బీమా పేరిట రైతులను జగన్ ముంచారని దుయ్యబట్టారు. రైతు సమస్యలపై ఆయన మొసలి కన్నీరు మానుకోవాలని చురకలంటించారు. బీమా సంస్థలకు రూ.1300 కోట్లకు పైగా బకాయిలు పెట్టి, వాటిని మేం కట్టాలనడం శోచనీయమని అన్నారు. సాగును అస్తవ్యస్తం చేసిన జగన్ రైతులను ఆత్మహత్య ఊబిలోకి నెట్టారని ఫైర్ అయ్యారు.

News October 30, 2024

విరాట్ కోహ్లీ భావోద్వేగాలు అదుపులో లేవు: హాగ్

image

టీమ్ ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ భావోద్వేగాలు అదుపులో లేకపోవడం వల్లనే రాణించలేకపోతున్నారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ వ్యాఖ్యానించారు. ‘విరాట్ పరిస్థితిని మరీ ఎక్కువగా అంచనా వేసి దూకుడుగా ఆడాలని ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే విఫలమవుతున్నారు. అతడితో పోలిస్తే రోహిత్ టెక్నిక్ ప్రస్తుతం బాగుంది. ఏదేమైనా.. న్యూజిలాండ్‌ను భారత్ తేలికగా తీసుకోవడమే ఈ సిరీస్ ఓటమికి కారణం’ అని విశ్లేషించారు.