News January 2, 2025

భోజనం తర్వాత స్వీట్ తింటే..

image

మధ్యాహ్నం భోజనం తర్వాత అప్పుడప్పుడూ కొంత మొత్తంలో స్వీట్ తింటే ఫర్వాలేదు. కానీ రోజూ లేదా ఎక్కువ మోతాదులో లాగిస్తే ఆరోగ్యానికి హానికరమని డాక్టర్లు చెబుతున్నారు. అధిక మోతాదులో స్వీట్స్/డెజర్ట్స్ తిన్నాక యాక్టివ్‌గా ఉండలేము. పైగా రక్తంలో త్వరగా షుగర్ లెవల్ పెరగడం, జీర్ణ, దంత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అటు భోజనం+ కూల్‌డ్రింక్స్ కాంబినేషన్‌తో తాత్కాలిక ఉపశమనం లభించినా మంచి కంటే చెడు ఎక్కువ.

Similar News

News January 13, 2026

వివేకా హత్య కేసులో YS సునీత మరో అప్లికేషన్

image

వివేకా హత్యకేసులో ఆయన కుమార్తె YS సునీత SCలో మరో అప్లికేషన్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు పాక్షికంగానే ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఆమె సవాలు చేశారు. తాము లేవనెత్తిన అంశాలకు విరుద్ధంగా HYD CBI కోర్టు పాక్షిక విచారణకు ఆదేశించినట్లు అప్లికేషన్‌లో పేర్కొన్నారు. విచారణను SC వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. కాగా CBI విచారణ కొనసాగింపుపై 3నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని SC గతంలోనే ట్రయల్ కోర్టును ఆదేశించింది.

News January 13, 2026

ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్లులకు నిధులు

image

TG: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో బిల్లులు ఆగిపోయిన ఎల్-3 కేటగిరీ లబ్ధిదారులకు బకాయిలను విడుదల చేశారు. కలెక్టర్ల నివేదికల మేరకు అర్హులైన లబ్ధిదారుల పెండింగ్ బిల్లులకు రూ.12.17 కోట్లు రిలీజ్ చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ MD వి.పి.గౌతం తెలిపారు. అద్దె ఇళ్లలో ఉంటూ ఇండ్లు నిర్మించుకుంటున్న వారితోపాటు, పాత ఇందిరమ్మ పథకంలో బేస్‌మెంట్ వరకే పనులు చేసిన వారి పెండింగ్ బిల్లులనూ ఈ నిధులతో క్లియర్ చేయనున్నారు.

News January 13, 2026

‘చైనా పార్టీ’తో BJP సమావేశంపై కాంగ్రెస్ ఫైర్

image

సరిహద్దుల్లో చైనా షాక్స్‌గామ్ వ్యాలీని ఆక్రమించుకుంటూ ఉంటే.. BJP నేతలు ఆ దేశ కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులతో ఢిల్లీలో రహస్య చర్చలు జరపడం ఏంటని కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. గల్వాన్‌లో సైనికులు ప్రాణత్యాగం చేసినా, అరుణాచల్‌లో చైనా గ్రామాలు కడుతున్నా BJPకి పట్టదా? అని సుప్రియా శ్రీనేత్ ప్రశ్నించారు. అసలు ఈ బంధం వెనక ఉన్న ఒప్పందం ఏంటని ధ్వజమెత్తారు. BJP నేతలతో CCP ప్రతినిధులు సోమవారం సమావేశమయ్యారు.