News January 2, 2025

పార్టీ మూడ్‌లో బుల్స్: రూ.5L కోట్లు లాభం

image

బుల్స్ పార్టీ మూడ్‌లో ఉండటంతో బెంచ్‌మార్క్ సూచీలు పరుగులు పెడుతున్నాయి. నిఫ్టీ 24,045 (+303), సెన్సెక్స్ 79,514 (+1000) వద్ద ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్లు రూ.5L కోట్లమేర సంపదను పోగేశారు. మెరుగైన GST రాబడి, అనుకూల టెక్నికల్స్, Q3 ఫలితాలపై సానుకూల అంచనాలు, IT సెక్టార్ బూస్ట్ ఇవ్వడం, వినియోగం పెరుగుతుందన్న అంచనాలే ఇందుకు కారణాలు. AUTO, FINANCE, IT షేర్లు దుమ్మురేపుతున్నాయి. bajajfinsv 8% పెరిగింది.

Similar News

News November 8, 2025

వంటింటి చిట్కాలు

image

* ఉప్పు నిల్వ చేసే డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ వేస్తే.. ఉప్పు తేమగా మారదు.
* అల్లం, వెల్లుల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే.. కాగితంలో చుట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.
* కొత్త బంగాళదుంపలు ఉడికించేటప్పుడు నాలుగు పుదీనా ఆకులు వేస్తే మట్టి వాసన రాదు.
* కరివేపాకు పొడి చేసేటప్పుడు అందులో వేయించిన నువ్వుల పొడి వేస్తే మరింత రుచిగా ఉంటుంది.

News November 8, 2025

జమ్మూ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

image

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ 5 నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 16వరకు అప్లై చేసుకోవచ్చు. లైబ్రేరియన్, డిప్యూటీ లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు రూ.1000. వెబ్‌సైట్: https://cujammu.ac.in/

News November 8, 2025

DANGER: ఇయర్‌ఫోన్లు అధికంగా వాడుతున్నారా?

image

శరీరంలో ఇయర్‌ఫోన్ భాగమైపోయిందా అన్నట్లు కొందరు ఉదయం నుంచి రాత్రి వరకూ దానిని వాడుతుంటారు.. అలా గత మూడేళ్లుగా రోజుకు 12గంటలు ఇయర్‌ఫోన్లు వాడిన ఓ యువతి తీవ్ర అనారోగ్యానికి గురైంది. వినికిడి తగ్గిపోవడం, ‘టిన్’ శబ్దం వినిపించడంతో ఆమె ENT ఆస్పత్రికి వెళ్లగా చెవిలో పొర ఇన్‌ఫెక్ట్ అయి చీము చేరిందని వైద్యులు తెలిపారు. ఇయర్‌ఫోన్ అతి వినియోగం వినికిడి శక్తిని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.